DJ Tillu : ఎట్టకేలకు టిల్లుకు హీరోయిన్​ దొరికేసింది.. టిల్లు స్క్వేర్​లో రాధిక ఎవరంటే..?DJ Tillu : డీజే టిల్లు.. 2022ను షేక్ ఆడించిన సినిమా. గతేడాదిలో ఏ ఈవెంట్​కు వెళ్లినా.. ఏ ఫంక్షన్​లో చూసిన టిల్లు అన్నా డీజే పెడితే సాంగే వినిపిస్తోంది. ఆ తర్వాత ఎన్నో మాస్ సాంగ్స్ వచ్చినా పార్టీ సాంగ్ అంటే టిల్లు పాటేనని జనం ఫిక్స్​ అయ్యారు. ఇప్పటికీ ఈ పాటకు ఆదరణ తగ్గలేదు. ఇక డీజే టిల్లు మూవీలో సిద్ధూ జొన్నలగడ్డ యాక్టింగ్​కు ప్రేక్షకులు మామూలుగా ఫిదా కాలేదు. అలాగే రాధిక అందానికి.. ఆమె నటనకూ ఆడియెన్స్ జై కొట్టారు.

Anupama Parameswaran DJ Tillu
Anupama Parameswaran DJ Tillu

ఇన్​స్టాగ్రామ్​లో.. ఫేస్​బుక్​లో.. ఇలా ఏ సోషల్ మీడియా వేదికలో చూసినా.. అట్లుంటది మనతోని, ఇది నిజంగానే నువ్వు నన్ను అడుగతన్నవా రాధికా, ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి నీకు అంత ప్రాబ్లెం, నాదసలే డెలికేట్ మైండ్.. ఇలాంటి డైలాగ్స్ అన్నీ తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికీ ఇద్దరు వ్యక్తులు ఏదైనా సరదాగా ముచ్చట పెడితే ఈ డైలాగ్స్ తప్పక వస్తుంటాయంటే ఈ మూవీ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రేజ్ చూసే ఈ మూవీకి సీక్వెల్ తీయాలని ప్లాన్ చేశారు మూవీ టీమ్. ప్లాన్ అయితే చేశారు కానీ.. షూటింగ్ చేసినప్పటి నుంచి తెగ చిక్కులు వచ్చి పడ్డాయి.

డీజే టిల్లుకు సీక్వెల్​గా ‘టిల్లు స్క్వేర్​’ని తెరకెక్కిస్తున్నట్టు చిత్ర బృందం అదే ఏడాది దీపావళి కానుకగా ప్రకటించింది. కథానాయికగా అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తుందని వెల్లడించింది. అయితే, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అనుపమ ఆ ప్రాజెక్టు నుంచి వైదొలిగిందని వదంతులు వచ్చాయి. ఆమె స్థానంలో మీనాక్షి చౌదరి ఎంపికైందని, ఆ తర్వాత ఆమె కూడా సినిమా నుంచి వెనక్కి వచ్చేసిందని, ఆ స్థానంలో శ్రీలీల ఎంట్రీ ఇచ్చిందని.. ఇలా పలు రకాల ఊహాగానాలు పలు వెబ్‌ సైట్లు, సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. రొమాంటిక్ ఫేమ్ కేతిక శర్మ, ప్రేమమ్ ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ పేర్లు కూడా వినిపించాయి. అయితే సిద్ధూతో రొమాన్స్ చేయలేకనో.. రెమ్యునరేషన్ కుదరకనో ఈ భామలంతా నో చెప్పినట్లు వార్తలొచ్చాయి.

అయితే ఇప్పుడు ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది క్యూటీ అనుపమ పరమేశ్వరన్. టిల్లుకు హీరోయిన్​గా అనుపమనే ఫిక్స్ అయిందనే విషయం తాజాగా ఈ బ్యూటీ పెట్టిన పోస్టుతో తెలిసిపోయింది. టిల్లు స్క్వేర్​ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టిన ఆమె హీరో సిద్ధు జొన్నలగడ్డ జుత్తుకు జెల్‌ (క్రీమ్‌) రాస్తూ కనిపించింది. 

‘ఇది నా ప్రత్యామ్నాయ వృత్తి’ అంటూ సంబంధిత వీడియోను అనుపమషేర్‌ చేసింది. ‘డిజే టిల్లు’కు విమల్‌ కృష్ణ దర్శకత్వం వహించగా దాని సీక్వెల్‌ను రామ్‌ మల్లిక్‌ డైరెక్ట్‌ చేస్తున్నారు. సూర్య దేవర నాగవంశీ నిర్మాత. తొలి భాగంలోని హీరో పాత్ర టిల్లు, హీరోయిన్‌ పాత్ర రాధిక (నేహాశెట్టి నటించింది) యువతను కట్టిపడేశాయి. దాంతో, ఈ సినిమా ప్రకటన రాగానే ఆడియన్స్‌లో ఆసక్తి మొదలైంది.

Tags: