Anchor Sowmya : జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది..వచ్చిన కొద్ది రోజులకే బాగా ఫెమస్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఫాలోయింగ్ ఉందో అందరికి తెలుసు.. తాజాగా ఎల్లో డ్రెస్ లో మెరిసింది. స్లీవ్ లెస్ గౌనులో ఎల్లోర శిల్పంలా మెరిసిపోతుంది. మత్తెక్కించే కళ్లతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది. స్టన్నింగ్ స్టిల్స్ పంచుకుని ఇంటర్నెట్‌లో అలజడి సృష్టిస్తుంది సౌమ్య రావు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

ఇందులో సౌమ్య రావు ఇచ్చిన పోజులు చర్చనీయాంశం అవుతున్నాయి. కొన్ని కొంటెగా, మరికొన్ని చిలిపిగా పోజులిచ్చింది జబర్దస్త్ యాంకర్. అయితే అందులో ఓ ఫోటోపై మాత్రం నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఆమె షేర్ చేసిన మొదటి ఫోటోనే ఇప్పుడు నెట్టింట రచ్చ లేపుతుంది.ఆమె చేయి పైకెత్తి పట్టుకుని ఓ కన్నుతో దోబూచులాడుతుంది. అయితే చూడ్డానికి అది మరోలా ఉంది. ఫుల్ బాటిల్ అడిగినట్టుగా ఉంది. దీన్నే హైలైట్ చేస్తూ, ఫుల్ బాటిల్ కావాలా చేయి అంతా పెట్టావు అంటూ పంచులు పేలుస్తున్నారు…మరికొంతమంది అమ్మాయి అందం వేరే లెవల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు..

అనసూయ స్థానంలో యాంకర్‌గా వచ్చింది సౌమ్య రావు. అయితే మిశ్రమ స్పందన రాబట్టుకుంటుంది. ఈమెపై కొందరు పెదవి విరుస్తున్నారు. మరికొందరు సింప్లీ సూపర్ అంటున్నారు. అనసూయ రేంజ్‌లో సందడి చేయడం లేదని, ఆ గ్రేస్ కనిపించడం లేదని, కానీ పంచ్ లకు కౌంటర్లు ఇస్తుందని టాక్ ఉంది..కన్నడ నుంచి వచ్చిన ఈ బ్యూటీ సీరియల్స్, చిన్న చిన్న షోలు చేసుకుంటూ ఆకట్టుకుంది. ఈటీవీ ఈవెంట్‌లో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఏకంగా జబర్దస్త్ షోకే యాంకర్‌గా చేసే ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు పాపులారిటీ, క్రేజ్‌ని సొంతం చేసుకుంది.. మొత్తానికి ఈ ఫోటోలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి..