Anchor Anasuya కోసం పలాసలో పోటెత్తిన జనం.. వీడియో వైరల్..

- Advertisement -

Anchor Anasuya శంకర్ థియేటర్ దగ్గర కేటీ రోడ్, కాశిబుగ్గ పలాస లోని లక్కీ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి అనసూయ వెళ్ళగా అక్కడి ప్రాంత ప్రజలందరూ అనసూయని చూసేందుకు తండోపతండాలుగా వచ్చారు.. అభిమానులను చూపిస్తూ అనసూయ తన ఇన్స్టా స్టోరీలను షేర్ చేసుకుంది కొన్ని వీడియోలను.. అనసూయ ను చూసేందుకు వేల మంది జనాలు అక్కడికి రావడం విశేషం .అనసూయకు అక్కడ ప్రేక్షకులు అంట బ్రహ్మరథం పట్టారు. అందుకు సంబంధించిన విజువల్స్ ని కూడా అనసూయ పంచుకున్నారు.

అనసూయ టాప్ లెస్ ఓపెన్ కారులో నిలబడి తన అభిమానులకు అభివాదం చేసింది. వంగ పువ్వు రంగు చీరలో వయ్యారాలు పోయింది అనసూయ. ఫుల్ పర్పుల్ కలర్ బ్లౌజ్ లో వంగ పువ్వు పట్టు చీర కట్టుకొని తళుక్కున మెరిసింది అనసూయ.. అనసూయ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. షాపింగ్ మాల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా కూడా అనసూయ అభిమానులతో నిండిపోయింది..

Anchor Anasuya
Anchor Anasuya

కిక్కిరిసిపోతున్న జనాల్లో కూడా అనసూయ తన అభిమానులకు అభివాదం చేస్తూ వారికి ఇంకాస్త హుషారేత్తించేలాగా మాట్లాడింది.. అంతేకాకుండా తన అభిమానుల కోసం అదిరిపోయే స్టెప్పులు కూడా వేసింది.. అనసూయ లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం తన కోసం వచ్చిన అభిమానుల విజువల్స్ వీడియోస్ ను పంచుకుంది. తనకోసం వచ్చిన అభిమానుల కోసం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. థాంక్యూ పలాస అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here