Guess The Actress : ‘అతనొక్కడే’ మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఆమె ఎలా తయారు అయ్యిందో చూస్తే ఆశ్చర్యపోతారు!

- Advertisement -

Guess The Actress : తెలుగు, తమిళం బాషలలో వరుసగా సినిమాలు చేసి ఆనతి కాలం లోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు సింధు తులాని. అందం తో పాటు అద్భుతమైన అభినయం ఉన్న ఈ అమ్మాయి, అందరి హీరోయిన్స్ లాగా గ్లామర్ షోస్ ని నమ్ముకొని కెరీర్ ని నెట్టుకొని రాలేదు, తనకు ఉన్న టాలెంట్ తోనే దాదాపుగా 50 సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గానే చేసింది.

Guess The Actress
Guess The Actress

2000 సంవత్సరం బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ – హ్రితిక్ రోషన్ – అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘మోహబత్తాయిన్’ అనే సినిమా ద్వారా చిన్న పాత్రతో వెండితెరకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగు లో ‘ఐతే’ సినిమా ద్వారా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఈ సినిమా కి ఆమె ‘బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్’ క్యాటగిరీ లో నామినేషన్ కూడా దక్కించుకుంది.

ఇక ఆ తర్వాత తమిళం లో ఈమె శింబు హీరోగా నటించిన ‘మన్మధన్’ అనే సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేస్ లోకి దూసుకొచ్చింది. ఈ చిత్రం లో ఆమె చేసిన నెగటివ్ క్యారక్టర్ ని ఇప్పటికీ మనం మరచిపోలేము. ఇక ఆ తర్వాత వెంటనే నందమూరి కళ్యాణ్ రామ్ తో ‘అతనొక్కడే’ వంటి సూపర్ హిట్ సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత సింధు తులాని వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.వరుసగా సినిమాలు మీద సినిమాలు చేస్తూ అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

- Advertisement -
sindhu tolani Photos

అలా కెరీర్లో హీరోయిన్ రోల్స్ మాత్రమే కాదు , క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ లో కూడా బాగానే రాణించింది. ముఖ్యంగా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రం లో అల్లు అర్జున్ కి వదిన గా నటించి మంచి మార్కులు కొట్టేసింది.ఆమె చివరగా వెండితెర మీద కనిపించిన చిత్రం ‘చిత్రంగదా’.ఆ తర్వాత ఆమె చేతన్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పెళ్ళాడి సినిమాలకు దూరమైంది. వీళ్లిద్దరికీ శ్వేతా అనే కుమార్తె కూడా ఉంది. అయితే సింధు తులాని లేటెస్ట్ ఫోటో ఒకటి ఎక్సక్లూసివ్ గా మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

sindhu tolani Family Photos
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here