చెల్లెలు మెహందీ ఫంక్షన్ లో సిగరెట్ తాగి రచ్చ చేసిన లైగర్ బ్యూటీ Ananya Panday.. కెమెరాలకు అడ్డంగా దొరికిపోయిందిగా!

- Advertisement -

Ananya Panday సిగరెట్ తాగడం,మందు కొట్టడం వంటివి సినీ సెలెబ్రెటీలకు కొత్తేమి కాదు.వాళ్ళ కల్చర్ లో ఒక్క భాగం గా అయిపోయింది ఇది.సోషల్ మీడియా ని తరుచూ అనుసరించే వాళ్ళు ఇలాంటివి చాలా లైట్ తీసుకోవచ్చు.కొంతమంది తిట్టొచ్చు కూడా, కానీ సమయం సందర్భం లేకుండా ఎక్కడ పడితే అక్కడ సిగరెట్లు కాలిస్తే మాత్రం అది చాలా పెద్ద తప్పే.

Ananya Panday
Ananya Panday

రీసెంట్ గా ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఇలాంటి పని చేసే కెమెరాలకు అడ్డంగా దొరికిపోయి సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోలింగ్ కి గురి అవుతుంది.ఇక అసలు విషయానికి వస్తే అనన్య పాండే తన క‌జిన్ అల‌నా పాండే మెహందీ ఫంక్షన్ కి హాజరైంది.అయితే ఈమె అక్కడ కూడా సిగరెట్ తాగకుండా ఉండలేకపోయింది.అదే ఫంక్షన్ కి వచ్చిన ఒక యువకుడు ఈ ఫోటో ని తన కెమెరాలో తీసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేసాడు.అది ఇప్పుడు వైరల్ గా మారింది.

పుబ్బులలో , పార్టీలలో సిగరెట్ తాగడంలో తప్పు లేదు కానీ, ఒక మెహందీ ఫంక్షన్ కి వచ్చి ఇలా సిగరెట్లు తాగడానికి సిగ్గుగా అనిపించడం లేదా అంటూ నెటిజెన్స్ అనన్య పాండే పై విరుచుకుపడుతున్నారు.ఈ బ్యూటీ తెలుగు లో విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే.

- Advertisement -

ఈ సినిమా అనుకోని విధంగా భారీ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లో స్థిరపడిపోవాలని చూసిన అనన్య పాండే కి చివరికి నిరాశే మిగిలింది.అందం పరంగా ఆమె ఆకట్టుకున్నప్పటికీ కూడా, యాక్టింగ్ పరంగా ఇంత వరస్ట్ గా ఉందేంటి అని ప్రేక్షకుల చేత పెదవి విరుచుకునేలా చేసింది.ప్రస్తుతం ఈమె చేతిలో మూడు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి.ఈ మూడిట్లో ‘డ్రీం గర్ల్ 2 ‘ అనే చిత్రం మీద మాత్రమే ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here