Amigos Trailer Review : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే .. ఆకట్టుకుంటున్న అమిగోస్ ట్రైలర్..Amigos Trailer Review : నందమూరి కళ్యాణ్ రామ్ బింసారా హిట్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందించింది. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ..రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్‌ రామ్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌, టీజర్, పాటలు సినిమాపై మాంచి హైప్‌ క్రియేట్‌ చేశాయి.. కథ ఎలా ఉంటుందో చూద్దాం..

Amigos Trailer Review
Amigos Trailer Review

కథ :

నందమూరి కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ చేసిన సినిమా ‘అమిగోస్’.. ఇందులో ఆషికా రంగనాథ్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో కళ్యాణ్ రామ్ తొలిసారి నటించిన చిత్రమిది. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలు. ఈ నెల 10న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజు కర్నూలులో ట్రైలర్ విడుదల చేశారు.

ఇక ట్రైలర్ విషయానికొస్తే..ముగ్గురిలో ఒకరు ఇండియన్ పాబ్లో ఎస్కోబార్ అని ఇంట్రొడ్యూస్ చేశారు. అతడిని పోలిన వ్యక్తులు మరో ఇద్దరు ఉంటారు. ఒకరి గాళ్ ఫ్రెండ్ అయితే… ముగ్గుర్ని చూసి కన్‌ఫ్యూజ్ అవుతుంది. ముగ్గురిలో ఒకరు మిగతా ఇద్దరినీ తన ఇంటికి తీసుకు వెళతాడు. ఆ తర్వాత ఏమైంది? ‘రాక్షసుడిని తీసుకొచ్చి ఇంటిలో పెట్టావ్ కదరా.. అని తండ్రి తిడతాడు.

ఆ తర్వాత ఏమైంది? తనలా ఉన్న మరో ఇద్దరినీ ఒకరు ఎందుకు చంపాలని అనుకున్నారు? చీకట్లో ఉన్న ఆ డెవిల్ ఎవరు? నేషనల్ సెక్యూరిటీ చీఫ్ బిపిన్ అనే అతడిని చూసి ఎందుకు భయపడుతున్నారు? అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి.నేను ఎవరినీ బెదిరించను. ఐ జస్ట్ కిల్” అని చివరిలో కళ్యాణ్ రామ్ చెప్పే డైలాగ్… ముగ్గురిలో మృగం లాంటి ఒకరి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసింది. ”మనిషిని పోలిన మనుషులు ఎదురుపడితే అరిష్టం” అనే డైలాగ్ కథలో ఇంకేదో ఉందనే హింట్ ఇస్తోంది.

”సోమాలియా కరువు బాధితుడిలా ఆ ఆకలి చూపులు ఏంట్రా? తినేస్తావా ఆ పిల్లను” అని బ్రహ్మాజీ అడగటం చూస్తుంటే… కామెడీ, రొమాంటిక్ ట్రాక్ కూడా ఉందని అనిపిస్తోంది.. మొత్తానికి పోస్టర్ ను చూస్తే మూడు పాత్రలు ఉన్నట్లు తెలుస్తుంది..ఇద్దరు ఒకే పోలికతో ఉన్న వ్యక్తులు కలిస్తే రక్తపాతం అవుతుందని ఉంది.. అంటే దీంట్లో విలన్ ప్రమేయం లేనట్లు తెలుస్తుంది.. ఇప్పటివరకు రాని కొత్త కథను జనాల ముందుకు తీసుకురానున్నారు..

ఇప్పటికే కథపై క్లారిటీ వచ్చేస్తుంది.. ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి…ఇందులో ప్రతి క్యారెక్టర్ కు ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తుంది.. డైరెక్టర్ కొత్త కథను జనాలకు పరిచయం చేయన్నున్నారు.. తన మార్క్ తో ఆకట్టుకొనిప్రయత్నం చేసాడు.. ఇక సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.. ఈ సినిమా కూడా హిట్ అయితే కళ్యాణ్ రామ్ రేంజ్ పెరుగుతుంది.. చూడాలి ఎలా ఉంటుందో.. ట్రైలర్ సన్నివేశాలు ఎలా ఉన్నాయో ఓసారి చూడండి..

సినిమా : అమిగోస్
నటి నటులు : కళ్యాణ్ రామ్,ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ, రోహిణి తదితరులు..
అమిగోస్’ చిత్రానికి కూర్పు : త‌మ్మిరాజు,
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌ : అవినాష్ కొల్ల‌,
డ్యాన్స్ : శోభి,
ఫైట్ మాస్ట‌ర్స్ : వెంక‌ట్,
రామ్ కిష‌న్‌,పాట‌లు: ‘స్వ‌ర్గీయ’ శ్రీ వేటూరి, రామ‌జోగ‌య్య శాస్త్రి,
రెహ‌మాన్‌,
ఛాయాగ్రహణం : ఎస్‌. సౌంద‌ర్ రాజ‌న్,
సి.ఇ.ఓ : చెర్రీ,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత : హ‌రి తుమ్మ‌ల‌,
సంగీతం : జిబ్రాన్..