Divyavani : అవ్వా.! ఈ బాపుబొమ్మ కూడా క్యాస్టింగ్‌ కౌచ్ కి బలైయిందా.!? టాప్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..

- Advertisement -

Divyavani : దివ్యవాణి నేటితరం వారికి ఈ పేరు తెలియకపోవచ్చు కానీ.. పెళ్లి పుస్తకం సినిమాలో హీరోయిన్ అంటే ఇప్పటికి అదే క్రేజ్ ఉంది.. బాపు గారి సినిమాలంటేనే ఎంత క్రేజ్ ఉందో ఆ సినిమాలో బాపు బొమ్మ లాంటి దివ్య వాణికి కూడా క్రేజ్ ఉంది.. దివ్యవాణి బాపు హీరోయిన్ గా మారిపోయింది.. అచ్చ తెలుగు అమ్మాయిలాగా ఉండే దివ్యవాణి రూపం అప్పట్లో అందర్నీ అట్రాక్ట్ చేసింది..

దివ్యవాణి కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా హీరోయిన్గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. దివ్యవాణి నటించిన పెళ్లి పుస్తకం సినిమాతో ఆమె మంచి గుర్తింపును సంపాదించుకోవడంతో పాటు ఆమె కెరియర్ గ్రాఫ్ కూడా అమాంతం పెరిగిపోయింది..

ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో వచ్చిన మూడు సినిమాల్లో దివ్యవాణికి హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. మిస్టర్ పెళ్ళాం అనే సినిమాలో కూడా ముందుగా దివ్యవాణికి అవకాశం వచ్చిందట.. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా చివరికి వేరే హీరోయిన్ తీసుకున్నారు. ఆ సమయంలో తనకు అవకాశం ఇవ్వండి అని దివ్యవాణి కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడినా కూడా.. ఆ చిత్ర యూనిట్ తనని పక్కన పెట్టిందని దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు..

- Advertisement -

ఆ సమయంలో కొంతమంది ఈగోలకు తాను బల్లై అవ్వాల్సి వచ్చిందని దివ్యవాణి తెలిపారు. అందుకు ప్రధాన కారణం వాళ్ళు అడిగిన దానిని నేను కాదనడమే.. ఎందుకంటే వాళ్ళు చేయమన్న పని చేయడానికి తాను సిద్ధంగా లేనన్నారు. అందుకే తనను మిస్టర్ పెళ్ళాం సినిమాలో హీరోయిన్గా తీసేసారని చెప్పుకొచ్చారు.

అందం, అభినయం ఉన్నా హీరోయిన్గా ఇండస్ట్రీలో నేలదొక్కుకోవడానికి వారు అడిగింది చేయకపోవటమే కారణమని తెలిసిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంతకీ వాళ్లు ఏం అడిగారు.. ఏం ఇవ్వలేదు.. అనే విషయంపై దివ్యవాణి క్లారిటీ ఇవ్వలేదు. ఈ బాపు బొమ్మ దివ్యవాణి కూడా క్యాస్టింగ్ కౌచ్ కి బలయిందని బలైందని ఈ విషయాలు చూస్తేనే అర్థమవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here