OTT Release of The Year : ఉస్తాద్‌ భగత్‌సింగ్‌.. , ఫ్యామిలీస్టార్‌.. ఈ ఏడాది అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలివే

- Advertisement -

OTT Release of The Year  : ప్రముఖ ఓటీటీ వేదికగా అమెజన్‌ ప్రైమ్‌ వీడియో సూపర్ అప్డేట్స్​ను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. ఈ ఏడాది తమ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాల వివరాలు పంచుకుంది. ఇందులో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలు, విడుదలకు రెడీగా ఉన్న చిత్రాలు, జస్ట్ ఇప్పుడిప్పుడే ప్రకటించిన మూవీలు కూడా ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి, కాంతారా-2, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలన్నీ ప్రైమ్​ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ముంబయి వేదికగా జరిగిన ఈవెంట్‌లో ప్రైమ్‌లో రాబోయే సినిమాలు, సిరీస్‌ల జాబితాను ప్రకటించింది. ఇందులో ఏమేం సినిమాలు ఉన్నాయో ఓ లుక్కేద్దామా?

OTT Release of The Year
OTT Release of The Year

టాలీవుడ్ దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’, కన్నడ స్టార్ రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాంతార: చాప్టర్‌-1’, తమిళ్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న సూర్య మూవీ ‘కంగువా’ థియేట్రికల్‌ రన్‌ ముగిసిన తర్వాత అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో సందడి చేయనున్నాయి. అలాగే రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’, నితిన్‌ ‘తమ్ముడు’, శ్రీవిష్ణు ‘ఓం భీమ్‌ బుష్‌’ చిత్రాలు ప్రైమ్‌లోనే సందడి చేయనున్నాయి. ఇక వెబ్‌సిరీస్‌ల విషయానికొస్తే ఈ ఏడాది క్రేజీ సిరీస్​లు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. ఇందులో పేట్రియాటిక్, థ్రిల్లర్, రొమాంటి, క్రైమ్, కామెడీ, ఫ్యామిలీ ఇలా అన్ని జానర్​ల సిరీస్​లు ఉన్నాయి.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానున్న సినిమాలు :

కాంతార : చాప్టర్‌-1 (రిషబ్ శెట్టి)
ఉస్తాద్‌భగత్‌ సింగ్‌ ( పవన్ కల్యాణ్​, శ్రీలీల)
హరి హర వీరమల్లు ( పవన్ కల్యాణ్​, నిధి శెట్టి)
తమ్ముడు (నితిన్)
గేమ్‌ ఛేంజర్‌ ( రామ్​చరణ్​, కియారా అడ్వాణీ)
ఓం భీమ్‌ బుష్‌ ( శ్రీ విష్ణు)
అశ్వత్థామ (హిందీ) ( షాహిద్ కపూర్)
ఘాటి ( అనుష్క- క్రిష్ సినిమా)
ఫ్యామిలీస్టార్‌ ( విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌)
బాఘీ -4 (టైగర్‌ ష్రాప్‌)
హౌస్‌ఫుల్‌ -5 (అక్షయ్‌కుమార్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్‌)
ది మెహతా బాయ్స్‌ (బొమన్ ఇరానీ)
బి హ్యాపీ (అభిషేక్‌ బచ్చన్‌, నోరా ఫతేహి)
ఇక్కీస్‌ (అగస్త్య నంద)
స్త్రీ (షాహిద్‌ కపూర్‌, రాజ్‌ కుమార్‌ రావ్‌, పంకజ్‌ త్రిపాఠి), అభిషేక్‌ బెనర్జీ; దర్శకత్వం: అమర్‌ కౌశిక్‌; నిర్మాత: దినేష్‌ విజాన్‌, జ్యోతి దేశ్‌పాండే
తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా( షాహిద్‌ కపూర్‌, కృతి సనన్‌, ధర్మేంద్ర, డింపుల్‌ కపాడియా)

- Advertisement -

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానున్న వెబ్‌ సిరీస్‌ :

చీకట్లో (తెలుగు)
ఉప్పు కప్పురంబు (తెలుగు)
మీర్జాపూర్‌-3 (హిందీ)
ఫ్యామిలీమ్యాన్‌-3 (హిందీ)
పాతాళ్‌ లోక్‌-2 (హిందీ)
బందిష్‌ బండిట్స్‌ (హిందీ)
గుల్‌కందా (హిందీ)
మా కసమ్‌ (హిందీ)
వాక్‌ గర్ల్స్‌ ( హిందీ)
జిద్ది గర్ల్స్‌ (హిందీ)
బ్యాండ్‌వాలీ ( హిందీ)
దిల్‌ దోస్తీ డైలమా (హిందీ)
ది ట్రైబ్‌ (హిందీ)
పంచాయత్‌ -3 (హిందీ),
సురల్: ది వార్‌టెక్స్‌-2 (తమిళం)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here