Suhas : ఓర్నాయనో.. కలలో కూడా ఊహించని కాంబో.. సుహాస్ కు జోడీగా కీర్తి సురేష్

- Advertisement -

Suhas : ఇటీవల కాలంలో వస్తున్న సినిమాల్లో కొన్ని కాంబినేషన్లను అస్సలు ఊహించలేకపోతున్నాం. అలాంటి ఓ కాంబినేషన్‌ ఇప్పుడు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోగా ఇండస్ట్రీలో వరుస హిట్లు అందుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సుహాస్.. త్వరలోనే స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌తో నటించబోతున్నాడట. వీళ్లిద్దరి కాంబోలో ‘ఉప్పు కప్పురంబు’ అనే సినిమా రాబోతుంది. అయితే ఇది డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ తన ఓటీటీ కోసం రూపొందిస్తున్న సినిమా ఇది.

Suhas
Suhas

శశి దర్శకత్వంలో ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాధికా లావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి వసంత్ మురళీకృష్ణ మరింగంటి స్టోరీ అందించారు. ముంబై వేదికగా జరిగిన ప్రైమ్ ఈవెంట్‌లో ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇక ఉప్పు కప్పురంబు అనేది సెటైరికల్ కామెడీ జోనర్‌లో రూపొందించనున్నారు. ఇందులో కీర్తి సురేష్‌కి మంచి పెర్ఫామెన్స్ ఉన్న రోల్ ఆఫర్ చేశారట. అందుకే ఆమె వెంటనే ఒప్పుకుందని సమాచారం. ఇక ఈ సినిమా గురించి తెలియగానే సుహాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు. మహానటితో సుహాస్ నటించడం చాలా ఆనందంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు.

- Advertisement -

అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్– సుహాస్ జంటగా కనిపిస్తారా లేక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారో ఖచ్చితంగా తెలీదు. ఏది ఏమైనా సుహాస్ కెరీర్‌కి మాత్రం ఇది మంచి బూస్ట్ ఇచ్చేలాగే అనిపిస్తోంది. ప్రస్తుతం సుహాస్ చేతిలో నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రసన్న వదనం, శ్రీరంగనీతులు, గొర్రె పురాణం, ఆనందరావు అడ్వెంచర్స్ సినిమాలతో చాలా బిజీ షెడ్యూల్‌లో ఉన్నాడు. ఇక గతేడాది రైటర్ పద్మభూషణ్, ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజి బ్యాండుతో రెండు హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. హీరోగా చేస్తూనే మంచి పాత్రలు వస్తే వేరే సినిమాల్లో కూడా చేయడానికి రెడీగా ఉన్నట్లు సుహాస్ ఇప్పటికే ప్రకటించాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here