Amar Deep : శివాజీ ఒక తేనెపూసిన కత్తి లాంటోడు.. అలాంటి మోసగాడిని ఎక్కడా చూడలేదు : అమర్ దీప్

- Advertisement -

Amar Deep : ఇప్పటి వరకు ప్రసారమైన అన్నీ బిగ్ బాస్ సీజన్స్ లో ది బెస్ట్ సీజన్ గా బిగ్ బాస్ 7 నిల్చిన సంగతి తెలిసిందే. టీఆర్పీ రేటింగ్స్ పరంగా కానీ, ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే విషయం లో కానీ ఈ సీజన్ హిట్ అయ్యినంతగా ఏ సీజన్ అవ్వలేదు. ఇంత రక్తి కట్టించే విధంగా ఈ ఏడవ సీజన్ కొనసాగడానికి కారణం శివాజీ మరియు అమర్ దీప్ అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Amar Deep
Amar Deep

ఒకడు మైండ్ గేమ్ తో షో ని నడిపిస్తే, మరొకడు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ని పండించి షో ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా చేసాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత కాలం వీళ్లిద్దరు టామ్ & జెర్రీ లెక్కనే కొట్టుకుంటూ ఉండేవారు. అయితే టామ్ & జెర్రీ ఫ్రెండ్స్, కానీ ఇక్కడ శివాజీ మొదటి రోజు నుండి చివరి రోజు వరకు అమర్ దీప్ ని తొక్కే ప్రయత్నమే చేసాడు.

Amar Deep Shivaji

అమర్ దీప్ శివాజీ కి ఎనలేని గౌరవం అందిస్తే, శివాజీ మాత్రం ఎప్పుడూ అమర్ ని శత్రువులాగానే చూస్తూ వచ్చాడు. హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత కూడా అమర్ దీప్ పై శివాజీ చేసిన కామెంట్స్ ని అంత తేలికగా మరచిపోలేము. దొంగ ఆటలు ఆడినవాడు, రన్నర్ అయ్యాడు, ఇదంతా బిగ్ బాస్ కావాలనే వాడిని హైలైట్ చేసి రన్నర్ అయ్యేలా చేసాడు అంటూ చెప్పుకొచ్చాడు శివాజీ.

- Advertisement -

దీనిపై రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అమర్ దీప్ స్పందిస్తూ ‘శివాజీ అన్న మాటలు విన్న తర్వాత మనుషులు ఇలా కూడా ఉంటారా అని అనిపించింది. హౌస్ లో ఉన్నన్ని రోజులౌ నువ్వు నాకు చాలా నచ్చావ్ రా అన్నాడు. బయటకి వచ్చిన తర్వాత ఏమో ఇలా. తేనెపూసిన కత్తి అంటారు చూసారా, అదే ఈయన’ అంటూ చెప్పుకొచ్చాడు అమర్ దీప్. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here