Naga Vamsi : గుంటూరు కారం విషయంలో జరిగిన పెద్ద మిస్టేక్ అదే.. తప్పు ఒప్పుకున్న నిర్మాత నాగవంశీ

- Advertisement -


Naga Vamsi : ఏం ముహూర్తాన గుంటూరు కారం సినిమా స్టార్ట్ అయిందో తెలియదు కానీ.. మొదటి నుంచి ఎండింగ్ వరకు అన్ని అవాంతరాలే ఎదురయ్యాయి ఈ సినిమాకు. షూటింగ్ ప్రారంభమైన తర్వాత హీరోయిన్లు మారారని చాలా వార్తలు వచ్చాయి. షూటింగ్ కూడా చాలా టైం గ్యాప్ తీసుకుంది . ఆ తర్వాత సినిమాకి సంబంధించి నెగటివ్ అంశాలు ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి. అంతేకాదు మహేష్ బాబు.. అమ్మానాన్న కూడా ఈ సినిమా చేస్తున్న సమయంలోనే కన్నుమూశారు. ఆ తర్వాత సినిమాపై ఎలాంటి వార్తలు వినిపించాయో మనకు తెలిసిందే. సరే సినిమా విడుదల అయిన తర్వాత అయినా అంతా సెట్ అయిందా అంటే అదీ లేదు. అయితే సినిమా కలెక్షన్ల పరంగా ఓకే అనిపించుకుంది.

Naga Vamsi
Naga Vamsi

కానీ, టాక్ ప్రకారం గా మాత్రం సినిమా హిట్ అనికాకుండా ఫట్ అన్న వాళ్లే చాలా మంది ఉన్నారు. ఇలాంటి క్రమంలోని నాగవంశీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అలాంటి నెగటివ్ కామెంట్స్ చేసే వాళ్లకు ఇచ్చి పడేశారు. “సినిమా బాగోలేదు అంటున్నారు.. కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం బాగా కలెక్ట్ చేసి పెడుతుంది.. చిత్ర నిర్మాతలకు మాత్రం లాభాలు వచ్చిపడుతున్నాయి. ఇంకా ఎందుకు నెగిటివ్ టాప్ క్రియేట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు”.

Mahesh babu

నిజానికి గుంటూరు కారం విషయంలో మేము చేసిన ఒకే ఒక్క మిస్టేక్ బెనిఫిట్ షో లు వేయడం. అర్ధరాత్రి ఒంటిగంటకు వచ్చే ఫ్యాన్స్ సినిమాలో ఎక్కువగా మాస్ ఎలిమెంట్స్ కోరుకున్నారు మాస్ తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉండడంతో కాస్త బెడిసి కొట్టింది. అంతే ఒకవేళ మేము అర్ధరాత్రి షోలు వేయకుండా ఉండి ఉంటే సినిమాకి మొదటి నుంచి పాజిటివ్ టాక్ వచ్చేదేమో” అంటూ చెప్పుకొచ్చాడు నాగ వంశీ..!!

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here