Rashmika Mandanna : సందీప్ రెడ్డి, బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన యానిమల్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. గతేడాది డిసెంబర్ 1న రిలీజైన సినిమా రికార్డు వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా దాదాపు రూ. 900 పైగా గ్రాస్ కలెక్షన్స్ చేసింది. ఈ సినిమాలోని రణ్‌బీర్ రఫ్ అండ్ రగ్గడ్ లుక్ యూత్‌ని బాగా ఆకట్టుకుంది. అంతేకాదు చాక్‌లేట్ బాయ్ అయిన రణ్‌బీర్‌తో వాయిలెన్స్ చేయించి భారీ హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమాలో రణ్‌బీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక నటించింది. రణ్‌బీర్. రణ్‌విజయ్ పాత్ర పోషించగా.. రష్మిక గీతాంజలిగా అతడి భార్య పాత్రలో ఆకట్టుకుంది.
అయితే గీతాంజలి ఓ సీన్‌లో తన భర్త రణ్‌విజయ్‌ని చెంపపై కొడుతుంది. తను మరో యువతితో క్లోజ్‌గా మెదిలానని చెప్పగానే ఆమె అతడి చెంప చెల్లుమనిపిస్తుంది. అయితే ఈ సీన్ చేశాక తాను నిజంగానే ఏడ్చానని చెప్పింది రష్మిక. ప్రస్తుతం యానిమల్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆమె తాజాగా ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ‘యానిమల్’ మూవీ విశేషాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. “రణ్‌బీర్‌ను కొట్టిన ఆ సీన్ షాట్ తర్వాత నేను నిజంగా ఏడ్చాను.. గట్టి గట్టిగా అరిచాను. ఎందుకో తెలియదు. కానీ ఆ సీన్ తర్వాత ఫుల్ ఎమోషనల్ అయ్యాను. షాట్‌కు ముందు డైరెక్టర్ నాకు ఒక్కటే చెప్పారు.
మరో స్త్రీతో కలిశానని భర్త ఆ విషయం భార్యకు చెబితే ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో అలాగే రియాక్ట్ అవ్వాలని చెప్పాడు. దీంతో నేను పాత్రలో పూర్తిగా లీనమైపోయాను” అని చెప్పుకొచ్చింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. “ఆ సన్నివేశం చేయడానికి హాఫ్ డే పట్టింది. ఒకే షాట్‌లో సీక్వెన్స్ చేశాం.
షాట్‌కి ముందు డైరెక్టర్ చెప్పిన యాక్షన్, కట్‌కి మధ్య ఏం జరిగిందో కూడా నాకు అర్థం కానంతగా లీనమైన చేశాను. దీంతో రణ్‌బీర్‌ను కొట్టిన షాట్ తర్వాత కట్ చెప్పారు. అయినా నేను ఏడుస్తూనే ఉన్నాను. ఇక కాసేపటికీ తెరుకోని నార్మల్ అయ్యాను. ఆ తర్వాత రణ్‌బీర్ దగ్గరికి వెళ్లి మీరు ఓకేనా” అని అడిగా అంటూ చెప్పుకొచ్చింది.