Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమాలను ఇంతలా ప్రేమిస్తారా..?

- Advertisement -

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ కి సినిమా అంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే తన కెరియర్ లో ఎంతో ఇష్టంగా చేసిన సినిమా తొలిప్రేమ కోసం ఎవరూ చేయని చాలా పనులు పవన్ కళ్యాణ్ చేశారు. ముఖ్యంగా తన సీన్లు లేకపోయినా కూడా ఆ సినిమా కథ బాగా నచ్చడం వలన షూటింగ్లో కూర్చుని ఉండేవారట. సరదాగా సెట్స్ కి వచ్చి ప్రతిరోజు కూర్చునే వారట. సినిమా ఎలా వస్తుందని దగ్గరుండి ఆయనే గమనించేవారట. అప్పటికే పవర్ సార్ పవన్ కళ్యాణ్ పెద్ద హీరో అయినా కూడా ఏ అహంకారం లేకుండా సినిమా కోసం అహర్నిశలు కూడా ఎంతగానో కష్టపడ్డారు.

తొలిప్రేమ మూవీ లో చాలా సీన్స్ అలానే పాటలు కూడా పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టం తొలిప్రేమ మూవీ లో నీ మనసే పాట పవన్ కళ్యాణ్ కి ఫేవరెట్ పాట. ఈ మూవీ ఎడిటింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒకరోజు తనకి ఇష్టమైన పాట ఎడిటింగ్ జరుగుతుందని తెలుసుకుని రాత్రి ఎనిమిది గంటలకి రామానాయుడు స్టూడియోకి వచ్చారు పవన్ కళ్యాణ్. అప్పటికి కరుణాకర్ ఆ పాటని ఎడిటింగ్ చేస్తున్నారట ఒకసారి నాకు ఆ పాట చూపించి కరుణ అని అడిగారట దాంతో టైం పడుతుంది పవన్ గారు కాసేపు వెయిట్ చేయండి అని అన్నారట అసలు పవన్ కళ్యాణ్ వెయిట్ చేస్తున్నారని విషయాన్ని మర్చిపోయి కరుణాకర్ ఎడిట్ చేస్తూనే ఉన్నారట.

- Advertisement -

రాత్రి మూడింటి వరకు కూడా ఎడిటింగ్ అయ్యింది. అప్పుడు బయటకి వచ్చి చూసేసరికి బల్ల మీద పవన్ కళ్యాణ్ కూర్చుని ఉన్నారట ఇంకా వెళ్లి పోలేదా అని కరుణాకర్ అడిగితే ఆ పాట చూపిస్తే వెళ్ళిపోతాను అన్నారట అయిపోయిన తర్వాత చూపిస్తాను అని చెప్పావు కదా అందుకే వెయిట్ చేస్తున్నాను అని అన్నారట. ఆ రాత్రి కూడా పాటను చూసి అద్భుతంగా వచ్చిందని కరుణాకరన్ కి హాగ్ ఇచ్చి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పారట సినిమా అంటే ఆయనకి పిచ్చి. అర నిమిషం ఆలస్యమైనా సరే పెద్ద పెద్ద హీరోలు హడావిడి చేస్తూ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అంత సేపు ఎదురు చూశారట ఈరోజుల్లో ఇలాంటి ఒక హీరోని చూసి కరుణాకర్ అని పిచ్చివాడైపోయాడు జీవితంలోకి మళ్లీ ఇలాంటి గొప్ప స్టార్ తో సినిమా తీయడం జరుగుతుందా అనుకున్నారట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here