Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ వచ్చిన పుష్ప సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.తెలుగు కంటే కూడా ఇతర బాషలలో ఈ చిత్రం ప్రభంజనం సృష్టించింది.అల్లు అర్జున్ స్టామినా ని చూసి బాలీవుడ్ సైతం నోరెళ్ళబెట్టి చూసింది.అలాంటి సెన్సేషన్ కి సీక్వెల్ అంటే ఇండియా వైడ్ ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఆ అంచనాలకు తగ్గట్టుగానే పుష్ప సీక్వెల్ ‘పుష్ప : ది రూల్’ ని తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు మూడు నిమిషాల గ్లిమ్స్ వీడియో సోషల్ మీడియా ని ఎలా ఒప్పేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ మెంటలెక్కిపోతున్నారు.అల్లు అర్జున్ కి పుష్ప సినిమా బాలీవుడ్ లో ఇంత క్రేజ్ తెచ్చిపెట్టిందా అని ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోయారు.ఇక గ్లిమ్స్ వీడియో తో బాలీవుడ్ స్టార్ హీరోలకు కూడా సాధ్యపడని అనితర సాధ్యమైన రికార్డుని నెలకొల్పాడు అల్లు అర్జున్.
అసలు విషయం లోకి వస్తే మొన్న విడుదలైన గ్లిమ్స్ వీడియో కి సుమారుగా హిందీ లో 64 మిలియన్ వ్యూస్ వచ్చాయి.టీజర్స్ మరియు ట్రైలర్స్ కి తప్ప ఒక గ్లిమ్స్ వీడియో కి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం ఇదే తొలిసారి.ఇక తెలుగు లో ఈ గ్లిమ్స్ వీడియో కి 25 మిలియన్ వ్యూస్ వచ్చాయి, హిందీ తో పోలిస్తే తెలుగు లో వచ్చిన వ్యూస్ చాలా తక్కువ, దీనిని బట్టీ హిందీ లో ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
అలాగే తమిళం లో 5.3 మిలియన్ వ్యూస్, కన్నడ లో 1.3 మిలియన్ వ్యూస్ మరియు మలయాళం లో 2.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి.మొత్తం మీద 100 మిలియన్ వ్యూస్ కి దగ్గరగా వచ్చింది అన్నమాట.బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన ‘పఠాన్’ మూవీ టీజర్ కి 74 మిలియన్ వ్యూస్ వచ్చాయి.ఆ వ్యూస్ రికార్డు ని ‘పుష్ప : ది రూల్’ గ్లిమ్స్ బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.