Allu arjun : పుష్ప లుక్ పై చిరంజీవి రియాక్షన్.. షాక్ లో మెగా అభిమానులు

- Advertisement -

Allu arjun : ‘పుష్ప 2’ టీజర్, బన్నీ ఫస్ట్ లుక్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ఇదే టాపిక్. మూడు నిమిషాల టీజర్ లో ఉన్నది ఓ ఎత్తయితే.. చివర్లో బన్నీ-పులి మధ్య వచ్చే సీన్ అయితే వేరే లెవెల్ లో ఉంది. దానికి తోడు బ్యాక్ గ్రౌండ్ లో వినిపించే పుష్ప గాడి రూల్ అనే డైలాగ్ ఇంకా గూస్ బంప్స్ తెప్పిస్తూనే ఉంది. లేడీ గెటప్ లో ఉన్న బన్నీ ఫస్ట్ లుక్ అయితే అందరిలో ఆసక్తి రేపుతోంది. ఈరోజు అల్లు అర్జున్ బర్త్ డే (allu arjun). దీంతో స్టార్ సెలబ్రిటీల దగ్గర నుంచి ఫ్యాన్స్ వరకు అందరూ విషెస్ చెబుతున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేయడం మాత్రం స్పెషల్ గా కనిపించింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. ఇది చూసిన మెగా అభిమానులు షాక్ అవుతున్నారు. చిరూ నువ్వు గ్రేట్ అని కామెంట్స్ చేస్తున్నారు.

Allu arjun
Allu arjun

‘హ్యాపీబర్త్‌ డియర్‌ బన్నీ.. మళ్లీ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. పుష్ప: దిల్‌ రూల్‌లోని నీ ఫస్ట్‌లుక్‌ అదిరిపోయింది. ఆల్‌ ది వెరీ బెస్ట్‌’’ అని ట్వీట్‌ చేశారు. బన్ని పుట్టినరోజు సందర్భంగా చిత్ర పరిశ్రమలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ‘పుష్ప2’లో కథానాయికగా నటిస్తున్న రష్మిక కూడా విషెస్‌ చెబుతూ బన్నితో దిగిన ఫొటోను పంచుకుంది. ‘మా పుష్పరాజ్‌కు హ్యాపీయెస్ట్‌ బర్త్‌డే. ఈ ప్రపంచం మొత్తం మళ్లీ నీ యాక్షన్‌ చూడాలని వేచి చూస్తోంది. ఈసారి పుష్పను మరింత ప్రేమిస్తారు.. తగ్గేదేలే’’ అని పేర్కొంది. ఇక ‘వేరీ ఈజ్‌ పుష్ప’ అంటూ చిత్ర బృందం విడుదల చేసిన వీడియో సినిమాపై అంచనాలను పెంచుతోంది.

Actor Allu arjun
Actor Allu arjun

బన్ని పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘వేర్ ఈజ్ పుష్ప’ వీడియో అయితే 24 గంటల్లో ఎక్కువ మంది చూసిన తెలుగు సినిమా టీజర్లలో మూడో స్థానంలో నిలిచింది. దాదాపు 22మిలియన్లకు పైగా తెలుగు వీడియోను వీక్షించారు. అలాగే హిందీ వెర్షన్ వీడియో 30 మిలియన్ వ్యూస్‌కు దగ్గరగా ఉంది. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాలో అత్యధికమంది లైక్‌ చేసిన ఫస్ట్‌లుక్‌గా బన్ని స్టిల్‌ నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం వివరాలను షేర్‌ చేసుకుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here