Allu Arjun : మంచంపై బన్నీ.. పిల్లలకు కబుర్లు చెబుతూ అల్లరి చేసిన ఐకాన్ స్టార్

- Advertisement -

Allu Arjun : సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే స్టార్లలో అల్లు అర్జున్ ఒకరు. ఈ ఐకాన్ స్టార్ తనకు సంబంధించిన విషయాలను, సినిమా విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటుంటాడు. అలాగే అల్లు అర్హ, అయాన్ చేసే అల్లరి పనులను కూడా షేర్ చేస్తూ ఉంటాడు. ఇక ఆ వీడియోలను చూసిన ఫ్యాన్స్ మురిసిపోతుంటారు. ఒకప్పుడు బన్నీ తన పిల్లలతో కలిసి అల్లరి చేస్తున్న వీడియో ఇప్పుడు వైరలవుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆ వీడియోనే సందడి చేస్తుంది.

Allu Arjun
Allu arjun

ఆవీడియోలో అల్లు అర్జున్ తన ఇంటి గార్డెన్ లో నవారి మంచం వేసుకొని తన కూతురు, కొడుకుతో పడుకొని ఆకాశం వైపు చూపిస్తూ తెగ కబుర్లు చెబుతున్నాడు.ఇక స్నేహ రెడ్డి వీరి వీడియో ని తీసి అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. బన్నీ ఫ్యాన్స్ ఒకరు దీనిని రీ ట్వీట్ చేయడంతో మరోసారి వైరలగా మారింది. ఇక అల్లు అర్జున్ తన పిల్లల పెంపకంపై పలువురు ప్రముఖులు బన్నీని ప్రశంసించిన సంగతి తెలిసిందే. పిల్లలకు తెలుగు చక్కగా నేర్పారంటూ శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో సినీ ప్రముఖలు బన్నీని అభినందించారు.

సమంత (Samantha) టైటిల్‌ పాత్ర పోషించిన చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam)తో అర్హ వెండితెరకు పరిచయం అయింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో భరతుడిగా నటించిన అల్లు అర్హ (Allu Arha) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన ముద్దులొలికే మాటలతోనే చిన్నారి భరతుడి రాజసాన్ని ప్రతిబింబించేలా నటించింది. ఇక బన్నీ విషయానికొస్తే ప్రస్తుతం పుష్స2లో నటిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here