Allu Arha: ముద్దులొలికే మాటలతో అల్లు అర్హ డబ్బింగ్ ఎంత బాగా చెప్పిందో..

- Advertisement -

Allu Arha: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా సమంత నటించిన శాకుంతలం సినిమాతో పరిచయమైంది. ఈ సినిమాలో శకుంతల తనయుడు భరతుడి పాత్రలో అల్లు అర్హ నటించిన ఈ సినిమా ట్రైలర్ లో అల్లు అర్హత సింహం మీద వచ్చే షాట్ చూపించడంతో శాకుంతలం సినిమా కోసం సమంత అభిమానులతో పాటు అల్లు అర్జున్ అభిమానులు కూడా ఎదురు చూశారు. బన్నీ అభిమానులు కూడా మొదటి రోజే ఈ సినిమాకు వెళ్లి అర్హ నటనను చూసి ఆనందించారు. తాజాగా ఈ సినిమాకి అల్లు అర్హ చెప్పిన డబ్బింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.‌

Allu Arha
Allu Arha

ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో భరతుడుగా నటించిన అల్లు అర్హ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన ముద్దులొలికే మాటలతోనే చిన్నారి భరతుడి రాజసాన్ని ప్రతిబింబించేలా నటించింది. కాగా అల్లు అర్హ స్టార్ కు సంబంధించి వీడియో ప్రోమో చిత్ర బృందం విడుదల చేయగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అల్లు అర్హ డబ్బింగ్ డబ్బింగ్ స్టూడియోలో కూర్చొని తన ముద్దులొలికే మాటలతో డబ్బింగ్ డబ్బింగ్ చెప్పే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అల్లు అర్హ క్యూట్ గా డబ్బింగ్ చెబుతూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది చిన్న వయసులోనే అల్లు అర్జున్ పేరు నిలబెట్టింది అల్లు అర్హ ఈ సినిమాలో సుమారు 20 నిమిషాలు ఉండే నివిడి పాత్ర పోషించింది. అల్లు అర్హ మొదటి సినిమాతోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ కిడ్ గా గుర్తింపు తెచ్చుకుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here