Alia Bhatt : బ్లాక్ డ్రెస్​లో ఆలియా భట్ స్టన్నింగ్ ఫొటోలు

- Advertisement -

Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్​లో ఉంది. ఈ భామ తాజాగా బ్లాక్ కలర్ ఔట్​ఫిట్​లో సందడి చేసింది. ఈ ఔట్​ఫిట్​లో ఆలియా ఫిల్మ్ ఫేర్ ఈవెంట్​కు హాజరైంది. తన మెస్మరైజింగ్​ లుక్​తో ఆ ఈవెంట్​లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్​గా నిలిచింది. బ్లాక్ లాంగ్ ఫ్రాక్​లో కోల్డ్ షోల్డర్ ఔట్​ఫిట్​లో ఆలియా చాలా ట్రెండీగా కనిపించింది.

Alia Bhatt
alia bhatt

ఫిల్మ్ ఫేర్ ఈవెంట్​కు హాజరైన ఆలియాకు గంగూబాయి కాఠియావాడి సినిమాకు గానూ ఉత్తమ కథానాయిక అవార్డు లభించింది. ఈ భామ ఆ సినిమాలో వేశ్యగా నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం ఎంత హిట్ అయిందో కూడా మనం చూసిందే. ఈ మూవీలో ఆలియా నటనకు ప్రేక్షకులే కాదు.. విమర్శకులు కూడా ఫిదా అయ్యారు. గంగూభాయిగా ఆలియా నటన, డైలాగ్ డిక్షన్​ అందర్నీ మెస్మరైజ్ చేసిన విషయం తెలిసిందే. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు సహా 9 విభాగాల్లో ‘గంగూబాయి కాఠియావాడి’ కి అవార్డులు వచ్చాయి.

Alia

మరోవైపు ఈ ఈవెంట్​లో ఆలియాను చూసి అందరూ తెగ షాక్ అయ్యారు. ఈ బ్యూటీ ఇటీవలే తల్లయిన విషయం తెలిసిందే. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఆలియా సూపర్ ఫిట్​గా కనిపించడంతో అందరూ సర్​ప్రైజ్ అయ్యారు. ఇక ఆలియా బాలీవుడ్​లో స్టార్ హీరోయిన్​ అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బ్రహ్మాస్త్ర, గంగూబాయి కాఠియావాడి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది.

- Advertisement -
Bhatt

ప్రస్తుతం ఆలియా బాలీవుడ్​లోనే సూపర్ బిజీగా ఉంది. ఆలియా ప్రస్తుతం బాలీవుడ్​లో రాకీ ఔర్ పింకీకి ప్రేమ్ కహానీ, జీ లే జరా అనే సినిమాల్లో నటిస్తోంది. ఇందులో రాకీ ఔర్ పింకీ కీ ప్రేమ్ కహానీ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ali

ఇవే కాకుండా ఈ ఏడాది ఆలియా హాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. హార్ట్ ఆఫ్ స్టోన్ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ షూటింగ్​ కూడా పూర్తయింది. త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here