ఇటీవల కాలం లో భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన చిత్రం అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ‘ఏజెంట్’. ప్రముఖ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి నిర్మాత అనిల్ సుంకర సుమారుగా 80 కోట్ల రూపాయిలు ఖర్చు చేసారు. కానీ ఈ చిత్రం నాలుగు రోజులకు కలిపి కనీసం 7 కోట్ల రూపాయిల షేర్ ని కూడా రాబట్టలేకపోయింది.
అన్నీ ప్రాంతాలలో రెంటల్ బేసిస్ మీద ఈ చిత్రాన్ని నడపడం ఆపేసి కమీషన్ బేసిస్ మీద నడుపుతున్నారు. నిర్మాత అనిల్ సుంకర కూడా ఈ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యిందని, దీని బాధ్య మొత్తం మాదే అని ట్విట్టర్ లో వేలాది మంది అభిమానుల సాక్షిగా ఒప్పుకున్నాడు.అయితే ఈ సినిమాని అక్కినేని నాగార్జున చెప్పినట్టుగా విని ఉంటే ఈరోజు ఫలితం వేరేలా ఉండేదని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న వార్త.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా షూటింగ్ కొనసాగుతున్న సమయం లో ఒకానొక దశలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి మరియు నిర్మాత అనిల్ సుంకర మధ్య గొడవలు అయ్యాయని, అప్పటికే సగం కూడా పూర్తి కానీ సినిమాని సురేందర్ రెడ్డి మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడని. ఆ సమయం లో ఈ చిత్రానికి కథ అందించిన వక్కంతం వంశీ నే ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్.
అయితే ఎప్పుడైతే సురేందర్ రెడ్డి ఈ సినిమా ని వదిలి బయటకి వెళ్ళాడో, అప్పుడే ఈ చిత్రాన్ని ఆపేయమని అక్కినేని అఖిల్ కి నాగార్జున చెప్పాడని, మళ్ళీ సురేందర్ రెడ్డి తిరిగి వచ్చిన తర్వాతే ఈ చిత్రం చెయ్యమని, లేకపోతే తలాతోకా లేకుండా ఔట్పుట్ చాలా చెత్తగా వస్తుందని నాగార్జున అఖిల్ కి వార్నింగ్ ఇచ్చాడట. కానీ అఖిల్ వక్కంతం వంశీ మీద నమ్మకం ఉందని చెప్పడం తో నాగార్జున కూడా ఇక ఏమి మాట్లాడలేకపోయాడు. ఒకవేళ నాగార్జున చెప్పిన విధంగా సమస్య సర్దుమణిగి , సురేందర్ రెడ్డి వచ్చే వరకు షూటింగ్ ఆపుకొని ఉంది ఉంటే, ఈరోజు ఈ చిత్రం కనీసం యావరేజి అయినా అయ్యుండేది అని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.