Agent Review : అక్కినేని అభిమానులకు ఎదురు చూపులు తప్పవా?

- Advertisement -

Agent Review : టాలీవుడ్ భారీ రేంజ్ అంచనాల నడుమ గ్రాండ్ డెబ్యూ ఇచ్చిన హీరోలలో ఒకరు అక్కినేని అఖిల్. అక్కినేని నాగార్జున చిన్న కొడుకుగా, రాబొయ్యే రోజుల్లో కాబొయ్యే మహేష్ బాబు అనే రేంజ్ హైప్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు.మనం సినిమాలో చిన్న గెస్ట్ రోల్ లో కనిపిస్తే రెండు తెలుగు రాష్ట్రాలు షేక్ అయ్యాయి.కచ్చితంగా ఇతను పెద్ద స్టార్ హీరో అవుతాడని అందరూ అనుకున్నారు.కానీ ఇండస్ట్రీ లోకి ఆయన అడుగుపెట్టి 8 ఏళ్ళు కావొస్తుంది. ఇప్పటికీ సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు.

ఆయన చివరి చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా ఆయన కెరీర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ అయితే కాలేదు కానీ, కమర్షియల్ గా నార్మల్ హిట్ గా నిలిచింది.ఈ చిత్రం ఆయన కెరీర్ కి ఏమాత్రం కూడా ఉపయోగపడలేదు.అందుకే అక్కినేని అభిమానులు భారీ బడ్జెట్ తో డైరెక్టర్ సురేందర్ రెడ్డి తీసిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ కోసం ఎదురు చూసారు.ఈరోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది, మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా లేదా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.

కథ :

- Advertisement -

కొలోనెల్ మహాదేవ్(మమ్మూటీ) టెర్రరిస్టుల ఆటలను అరికట్టేందుకు ఏజెంట్ (అఖిల్ ) ని రంగం లోకి దిగుతాడు.అంతకు ముందు ఆయన టీం చేసిన ఆపరేషన్స్ అన్నిటినీ టెర్రరిస్టులు విఫలం అయ్యేలా చేస్తారు.అందుకే ఈసారి స్పై ఏజెంట్ ని పంపి, వాళ్ళ రహస్యాలన్నీ తెలుసుకొని చివరికి వాళ్ళందరిని మట్టుపట్టించడమే ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.ఏజెంట్ మహాదేవ్ ఇచ్చిన టాస్కుని విజయవంతంగా పూర్తి చేస్తాడు.అయితే టాస్కు పూర్తి అయిన తర్వాత ఏజెంట్ ని చంపేయమని తన టీం కి ఆదేశాలు ఇస్తాడు మహాదేవ్.అతను ఎందుకు అలా చేసాడు, ఏజెంట్ ని చంపాల్సిన అవసరం మహాదేవ్ కి ఏముంది, చివరికి ఏజెంట్ ఎలా తప్పించుకున్నాడు, ఈ క్రమం లో ఆయన ఎన్ని ఆటుపోట్లని ఎదురుకున్నాడు అనేది వెండితెర మీద చూడాల్సిందే.

agent review
agent review

విశ్లేషణ :

డైరెక్టర్ సురేందర్ రెడ్డి ట్రైలర్ తోనే తన సినిమా స్టోరీ ఏంటో మొత్తం చెప్పేసాడు, ట్విస్టులను కూడా ఆయన ట్రైలర్ లోనే రెవీల్ చేసాడు. ఇది ఆయనకీ మొదటి నుండి ఉన్న అలవాటే, ఆడియన్స్ ని ముందుగా తన సినిమా ఎలా ఉండబోతుందో సిద్ధం చేస్తాడు, ఆ తర్వాత తన టేకింగ్ తో మ్యాజిక్ చేసి ఆడియన్స్ ని మైమరచిపొయ్యేలా చేస్తుంటాడు.ఈ చిత్రం లో కూడా ఆయన అదే చేసాడు, తన మార్కు స్టైలిష్ టేకింగ్, విభిన్నమైన హీరో క్యారక్టర్ డిజైన్ ఇలా అన్నీ చేసాడు.

కానీ సినిమాలోని సోల్ ని మాత్రం తన స్టైలిష్ టేకింగ్ లో ఇమడర్చలేక పొయ్యాడు సురేందర్ రెడ్డి.సినిమా చూసి బయటకి వస్తున్నపుడు ఎదో మిస్ అయ్యిందే అనే భావన ఆడియెన్స్ లో కలుగుతుంది.అయితే కొన్ని సన్నివేశాల్లో మాత్రం వింటేజ్ సురేందర్ రెడ్డి టేకింగ్ కనిపించింది.కానీ అదే ఊపుని సినిమా మొత్తం కొనసాగించడం లో విఫలం అయ్యాడు సురేందర్ రెడ్డి.

Akhil agent review

ఇక అక్కినేని అఖిల్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ చిత్రం లో ఆయన చాలా కష్టపడ్డాడు, డైరెక్టర్ సురేందర్ రెడ్డి అనుకున్న విధంగా హీరో క్యారక్టర్ ఎలా ఉండాలో అలా ఉండే ప్రయత్నం చేసాడు.కానీ ఆయన ఇంకా నటనలో రాటుదేలాలి. చాలా సన్నివేశాల్లో ఆయన నటన పరిణీతి చెందని విధంగా ఉంటుంది.

కానీ ముందు సినిమాలతో పోలిస్తే ఈ చిత్రం ఆయన చాలా ఎనెర్జిటిక్ గా కనిపించాడని చెప్పొచ్చు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన మమ్మూటీ ఈ చిత్రానికి ఆయువు పట్టులాగా నిలిచాడు.ఆయన పాత్రలోని షేడ్స్ మరియు ట్విస్ట్స్ ఆడియన్స్ ని అలరిస్తుంది.ఇక హీరోయిన్ సాక్షి వైద్య పర్వాలేదు అనే రేంజ్ లో నటించింది.ఇక ఈ సినిమాకి ఉన్న పెద్ద మైనస్ ఏదైనా ఉందా అంటే అది హిప్ హాఫ్ తమీజా అందించిన మ్యూజిక్,ఒక్కటంటే ఒక్క పాట కూడా ఆకట్టుకునే విధంగా లేదు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంత మాత్రం గానే ఉంది.కానీ ప్రొడక్షన్ విలువలు మాత్రం అద్భుతం, నిర్మాతలు ఎక్కడ తగ్గకుండా చాలా రిచ్ గా ఈ చిత్రాన్ని తీశారు.

చివరి మాట :

స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్ సినిమాలను చూసే ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా నచుతుంది. ఈ వీకెండ్ ఈ చిత్రాన్ని ప్రోత్సహించవచ్చు.

నటీనటులు : అక్కినేని అఖిల్ , మమ్మూటీ , సాక్షి వైద్య , సంపత్ రాజ్ , డినో మోరియా

మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాఫ్ తమీజా, భీమ్స్
డైరెక్టర్ : సురేందర్ రెడ్డి
నిర్మాతలు : సురేందర్ రెడ్డి, అనిల్ సుంకర
కథ : వక్కంతం వంశీ

ఏజెంట్’ మూవీ రేటింగ్ : 2.5/5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here