Adipurush : ఆ విషయంలో ఓం రౌత్ …ప్రభాస్ మాట వినివుంటే ఆదిపురుష్ వేరే లా ఉండేది….

- Advertisement -

Adipurush : భాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అని ఆశించిన ఆది పురుష్ చిత్రం ఘోరంగా విఫలమైంది. కార్టూన్ బొమ్మలాంటి గ్రాఫిక్స్ తో రామాయణాన్ని వక్రీకరించి చూపించారు అని ఈ చిత్రంపై ఎందరో ఆరోపించారు. ముఖ్యంగా ఆంజనేయ స్వామి దగ్గర చెప్పిన మాస్ డైలాగ్స్…. ద్రాక్ష గుత్తులు లాంటి దశకంఠుడు తలలు తో ఈ మూవీ భారీ విజువల్ డిజాస్టర్ గా నిలిచింది.

Adipurush
Adipurush

భారీ అంచనాల మధ్య విడుదల అయినప్పటికీ కంటెంట్ సరిగా లేకపోవడం తో ఈ మూవీ అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈ మూవీ కరెక్ట్ గా తీసుంటే ఇండస్ట్రీ లో బాహుబలి మించి రికార్డ్ సృష్టించేది అని ఎందరో తమ అభిప్రాయాలను వెల్లడించారు. అయితే చాలా మందికి తెలియని విశయం ఏమిటంటే…మూవీ షూటింగ్ టైం లో ప్రభాస్ కు ఈ మూవీ ఔట్పుట్ పై పలు సందర్భాలలో అనుమానం కలిగింది అంట.

స్క్రీన్ పైన ఈ మూవీ చూసిన ఎవరికైనా ప్రభాస్ ఎప్పుడు చిన్నతనంలో రామాయణం గురించి తెలుసుకోలేదా? అతను కనీసం ఒక్క సినిమా అయినా రామాయణం నేపథ్యంలో చూడలేదా? అన్న అనుమానం కలుగుతుంది. డైరెక్టర్ ఇలా తీసుకున్నప్పుడు అతను అయినా ఏం చేస్తున్నాడు కాస్త చెప్పొచ్చు కదా అని కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు.ఓం రౌత్ తో షూటింగ్ జరుగుతున్న సమయంలో రావణాసురుడు గెటప్ , మరికొన్ని సన్నివేశాల గురించి ప్రభాస్అ తన అనుమానాన్ని వ్యక్తం చేశారట.

- Advertisement -

ఇలా తీస్తే దీని రామాయణం అని ప్రజలు అనుకోరు అని, కాస్త రెఫరెన్స్ కి ఎన్టీఆర్ పాత రామాయణం సినిమాలు చూడమని కూడా ప్రభాస్ ఓం రౌత్ కు సజెస్ట్ చేసినప్పటికీ నా మీద నమ్మకం ఉంచు అంతా నేను చూసుకుంటాను అని ఆ డైరెక్టర్ తేలిగ్గా తీసుకున్నాడట. అయితే ఓం రౌత్ డైరెక్షన్ లో మూవీ అవుట్ ఫుట్ ఎలా ఉందో మన అందరికీ తెలుసు…3D వెర్షన్ కూడా కేవలం ప్రభాస్ మాట కాదనలేక విడుదల చేసిందే…లేకపోతే కనీసం ఈ మాత్రం కూడా కలెక్షన్స్ వచ్చేవి కాదు అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here