Project K : వైరల్ అవుతున్న ప్రభాస్ ‘ప్రాజెక్ట్ k ‘ ఫ్యాన్ మేడ్ పోస్టర్.. ఒరిజినల్ పోస్టర్ కంటే వెయ్యి రెట్లు బెటర్!

- Advertisement -

Project K యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘ప్రాజెక్ట్ K’ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని నిన్న గ్రాండ్ గా విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఎదో ఊహిస్తే ఎదో అయ్యింది అన్నట్టు. ఫస్ట్ లుక్ వేరే లెవెల్ లో ఉంటుంది అని అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఊహిస్తే, అమీర్ పెట్ చీప్ ఎడిటింగ్స్ చేసి ఇచ్చారు.

Project K
Project K

ఎవరిదో శరీరానికి ప్రభాస్ తల ని అంటించినట్టు అంత చీప్ ఎడిటింగ్ చెయ్యడానికి మనసు ఎలా వచ్చింది??, 500 కోట్ల రూపాయిల బడ్జెట్ తో సినిమాని తీస్తున్నారు, ఇలాంటి పోస్టర్స్ చూసినప్పుడు ఏమాత్రం తేడా అనిపించలేదా అని అభిమానులు మండిపడుతున్నారు. పోస్టర్ వచ్చిన తర్వాత ట్విట్టర్ లో రీట్వీట్స్ కంటే కూడా ఎక్కువగా నెగటివ్ కామెంట్స్ రావడం తో ప్రొడక్షన్ హ్యాండిల్ నుండి నిన్న విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని తొలగించారు.

దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు, ఈ ఫస్ట్ లుక్ కి ఏ రేంజ్ నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది అనేది. ఇక ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ ని కాసేపట్లో విడుదల చెయ్యబోతున్నారు. ఇకపోతే నిన్నటి నుండి ప్రభాస్ ఫ్యాన్స్ ఎడిట్ చేసిన ఒక ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. ప్రాజెక్ట్ K అధికారిక పోస్టర్ కంటే కూడా ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

- Advertisement -

దీనిని చూపించి పోస్టర్ ఈ రేంజ్ క్వాలిటీ ఉండాలి, ఆ ఎడిటర్ ఎవరో కనుక్కొని మన సినిమాకి పెట్టుకోండి అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో మేకర్స్ ని ట్యాగ్ చేసి సలహాలు ఇస్తున్నారు. అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ వంటి దిగ్గజాలతో ప్రభాస్ చేస్తున్న సినిమా కాబట్టియు కచ్చితంగా జాగ్రత్త వహించాల్సిందిగా అభిమానులు కోరుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here