పాన్ ఇండియా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా మరి కొద్ది రోజుల్లో విడుదల కానుంది.. ఈమేరకు చిత్రాయూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ ను పెంచారు.. తిరుపతి ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదలుకానుంది.. ఈరోజు సాయంత్రం ఈవెంట్ జరగనుంది.. ప్రస్తుతం ఈ టీమ్ తిరుపతిలో సందడి చేస్తున్నారు..ఈ రోజు సాయంత్రం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో అంగరంగవైభవంగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.. ప్రస్తుతం ప్రభాస్ టీమ్ తిరుమలలో శ్రీవారి సన్నిధిలో ఉన్నారు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం ఉదయం హీరో ప్రభాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చిత్ర యూనిట్‌తో సహా.. సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. ప్రభాస్‌ను చూసేందుకు భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు. వైకుంఠం-1 క్యూ కాంప్లెక్స్ వద్ద, మహా ద్వారం నుంచి బయటకు వచ్చే సమయంలో భక్తులను పోలీసులు విజిలెన్స్ అదుపు చేయలేకపోయింది. దీంతో అతి కష్టం మీద ప్రభాస్ ను ఆలయం ముందు నుంచి రాంభాఘీచ గేట్ వరకు తీసుకొచ్చి పోలీసులు కారులో పంపించారు. అనంతరం అక్కడి నుంచి ప్రభాస్ గెస్ట్ హౌస్‌కి చేరుకున్నారు…
అక్కడ కూడా జనం ప్రభాస్ ను వదల్లేదు..గెస్ట్ హౌజ్ చుట్టుపక్కల భక్తుల కోలాహలం నెలకొంది. దర్శన సమయంలో ప్రభాస్ వెంట టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తనయుడు ఉన్నారు. మరికాసేపట్లో తిరుపతి వెళ్లనున్న చిత్ర యూనిట్ సాయంత్రం జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్లో పాల్గొననున్నారు.. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈవెంట్ ప్రారంభం కానుంది.. విశేషం ఏంటంటే ప్రభాస్ ను దగ్గర నుంచి చూసేందుకు జనం ఇప్పటినుంచే స్టేజ్ దగ్గరకు వెళ్తున్నట్లు సమాచారం..ఇక ఈవెంట్ కు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇక సినిమా ఏ రేంజులో జనాలను ఆకట్టుకుంటుందో చూడాలి..