స్పెషల్ ఫొటోస్ షేర్ చేసిన లావణ్య త్రిపాఠి.. పెళ్లి కళ వచ్చిందంటూ కామెంట్స్

- Advertisement -

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ లావణ్య త్రిపాఠి మరోసారి తన అంద, చందాలతో నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. త్వరలో మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టబోతున్న ఈ ముద్దుగుమ్మ విత్ మేకప్ వితవుట్ మేకప్‌తో దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. తన స్టన్నింగ్ పోజులతో కుర్రాళ్ల హృదయాలను దోచుకుంటోంది. మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్‌తో ప్రేమలో పడ్డ ఈ బ్యూటీ పెళ్లి కన్ఫామ్ అయినా అందాల ఆరబోత తగ్గించడం లేదు.

లావణ్య త్రిపాఠి.
లావణ్య త్రిపాఠి.

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ‘అందాల రాక్షసి’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ పదేళ్లుగా వరుస చిత్రాలతో అలరిస్తూనే వస్తోంది. హీరోయిన్ గా తెలుగు, తమిళంలోనూ సినిమాలు చేస్తూ వస్తోంది. టాలీవుడ్ లోనే ఎక్కువగా ఆఫర్లు అందుకుంటోంది. గతంలో వరుసపెట్టి సినిమాలు చేసింది. ప్రస్తుతం కాస్తా జోరు తగ్గింది. కానీ మళ్లీ స్పీడ్ పెంచుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన సినిమాల అప్డేట్స్ అందిస్తూనే ఉంది. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలో గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తోంది. తాజాగా క్యూట్ సెల్ఫీలతో యూత్ బ్యూటీ కట్టిపడేసింది. దీంతో పెళ్లి కళ వచ్చేసిందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Lavanya tripathi

అందం విషయంలో, ఫిట్ నెస్ విషయంలో లావణ్య ఎప్పుడూ శ్రద్ధ వహిస్తుంటుంది. తాజాగా సూర్య రష్మిని పొందుతూ ఇలా సెల్ఫీలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరోవైపు ఈ ముద్దుగుమ్మ త్వరలో మెగా కోడలు కాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంతనేది చూడాలి. కొద్దిరోజులుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠి డేటింగ్ లో ఉందని, త్వరలోనే వీరి ఎంగేజ్ మెంట్ కూడా ఉంటుందంటూ ఇటీవల వార్తలు ఊపందుకున్నాయి. దీనిపై అటు వరుణ్, ఇటు లావణ్య స్పందించలేదు. అలాగనీ ఖండించనూ లేదు. ఇక లావణ్య చివరిగా ‘హ్యాపీ బర్త్ డే’ మూవీ, ‘పులి మేక’ సిరీస్ తో అలరించింది. ప్రస్తుతం తమిళంలో ‘తానల్‘ చిత్రంలో నటిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here