‘ఆదిపురుష్’ కూడా ఫెయిల్.. ఇక ‘భీమ్లా నాయక్’ రికార్డు ని ఎవ్వరూ బ్రేక్ చేయలేరా!

- Advertisement -

ఒక పవన్ కళ్యాణ్ అభిమాని అప్పట్లో ‘టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నంత వరకు, ఏ హీరో అభిమాని అయినా నాన్ పవన్ కళ్యాణ్ నెంబర్ 1 అని చెప్పుకోవాల్సిందే’ అని ఒక బీభత్సమైన ఎలివేషన్ వేసాడు. ఆ ఎలివేషన్ ని చూస్తుంటే రియాలిటీ లో కూడా నిజం అని అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేటెస్ట్ గా ‘ఖుషి’ సినిమాని రీ రిలీజ్ చేసి ఆల్ టైం సెన్సేషనల్ రికార్డు ని సృష్టించారు.

ఆదిపురుష్
ఆదిపురుష్

ఈ కలెక్షన్స్ రికార్డు ని బ్రేక్ చెయ్యడానికి ఇతర హీరోల అభిమానులు తమ అభిమాన హీరోల సినిమాలను రీ రిలీజ్ చేసారు. కానీ ఒక్క సినిమా కూడా ఖుషి కి దరిదాపుల్లోకి రాలేకపోయాయి. ఇది కాసేపు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా గత ఏడాది విడుదలై మంచి విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే.

అతి తక్కువ టికెట్ రేట్స్ తో విడుదల అయ్యినప్పటికీ కూడా వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకుంది ఈ చిత్రం. ఈ సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని లైవ్ గా 5 లక్షల మంది వీక్షించారు. కేవలం ఒక్క ఛానల్ నుండే ఈ ఈవెంట్ ని లక్ష 84 వేల మంది చూసారు. ఇది ఆల్ టైం ఇండియన్ రికార్డు,ఈ రికార్డుని పాన్ ఇండియన్ సినిమాలు సైతం బ్రేక్ చేయలేకపోయాయి. మిగిలిన స్టార్ హీరోల సినిమాలన్నీ విడుదల అయ్యాయి కానీ, ఒక్క సినిమా కూడా ‘భీమ్లా నాయక్’ రికార్డు కి దగ్గర్లో కూడా రాలేకపోయాయి. కేవలం రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టార్ర్ర్ చిత్రం #RRR మాత్రమే దగ్గరకి వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని సింగిల్ ఛానల్ లక్ష 54 వేల మంది వీక్షించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాకి సింగిల్ ఛానల్ లో లక్ష 31 వేల లైవ్ వ్యూస్, ‘అజ్ఞాతవాసి’ ఈవెంట్ కి లక్ష 29 వేల లైవ్ వ్యూస్ వచ్చాయి. ఇక నిన్న జరిగిన ‘రాధే శ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని సింగిల్ ఛానల్ లో లక్ష పది వేలమంది వీక్షించారు.

- Advertisement -

ఇలా స్టార్ హీరోల సినిమాలన్నీ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వ్యూయర్స్ కౌంట్ కి దగ్గర్లో కూడా రాలేకపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఈ రికార్డు ని ‘బ్రో ది అవతార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మేమే కొడుతాము అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో చెప్పుకొస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here