నిరాశపరుస్తున్న ‘ఆదిపురుష్’ అడ్వాన్స్ బుకింగ్స్..ఇప్పటి వరకు ఎంత గ్రాస్ వచ్చిందంటే!

- Advertisement -

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం ఈ నెల 16 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు తిరుపతి లో ఘనంగా జరగబోతుంది. ఈ ఈవెంట్ కి చిన్న జియ్యర్ స్వామి ముఖ్య అతిధిగా విచ్చేయబోతున్నారు.

ఆదిపురుష్
ఆదిపురుష్

అభిమానులతో పాటుగా తెలుగు ప్రజలు కూడా చిరకాలం గుర్తుంచుకునేలా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుందట, ఇందుకోసం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ రెండు నుండి మూడు కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నిర్మాతలు ఇంతలా ఖర్చు చెయ్యడం తొలిసారి దీనికే జరిగిందట. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ చాలా రోజుల క్రితమే అమెరికాలో ప్రారంభం అయ్యింది. ఒక్కసారి ఆ బుకింగ్స్ ట్రెండ్స్ ఎలా ఉందో చూద్దాము.

ఆదిపురుష్‘ చిత్రాన్ని అన్నీ బాషలలో 2D మరియు 3D ఫార్మట్స్ లో విడుదల చేస్తున్నారు. అమెరికా లో తెలుగు తర్వాత ఎక్కువగా హిందీ సినిమాలను చూస్తారు కాబట్టి, ఈ సినిమాని తెలుగు మరియు హిందీ వెర్షన్స్ కి సంబంధించి రెండు ఫార్మట్స్ లో బుకింగ్స్ ప్రారంభించారు. 3D బుకింగ్స్ బాగానే ఉన్నాయి కానీ, 2D బుకింగ్స్ మాత్రం చాలా వీక్ గా ఉన్నాయి. రెండు ఫార్మట్స్ కలిపి 300 కి పైగా షోస్ ని ఏర్పాటు చేసారు, ఈ 300 షోస్ కి గాను కేవలం 84 వేల డాలర్లు మాత్రమే వచ్చాయట.

- Advertisement -

ఇందులో 3D షోస్ సంఖ్య కేవలం 40 మాత్రమే, 40 షోస్ నుండి 50 శాతం కి పైగా వసూళ్లు వచ్చాయి. 3D షోస్ కి మంచి రెస్పాన్స్ ఉన్నప్పటికీ అదే రోజున హాలీవుడ్ మూవీ ఫ్లాష్ కూడా విడుదల ఉండడం తో షోస్ ఇవ్వడం లేదు. అందువల్ల ఈ చిత్రానికి ఫైనల్ ప్రీమియర్ నెంబర్ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టి చూస్తే కేవలం 7 లక్షల డాలర్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందట. సినిమాకి పెట్టిన బడ్జెట్ కి ఇది చాలా తక్కువే అని చెప్పాలి. రాబొయ్యే రోజుల్లో పుంజుకుంటుదేమో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here