ఇండస్ట్రీకి వచ్చాక రోజా నుంచి అనుష్క వరకు చేసిన పని తెలిస్తే షాక్‌ అవుతారు

- Advertisement -

సినిమా అనే గ్లామర్ ప్రపంచంలో చాలా మంది హీరోయిన్లు వస్తున్నారు.. పోతున్నారు. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం ఇండస్ట్రీ ఉన్నంత గుర్తుండి పోయేంతగా పేరు తెచ్చుకున్నారు. ఇక తెలుగులో టాప్ హీరోయిన్లుగా వెలిగిపోయిన కొంత వారి అసలు పేరు ఇండస్ట్రీకి వచ్చాక మార్చుకున్నారు. సినిమా వాళ్ల పేర్లకు పబ్లిక్ లో పబ్లిసిటీయే వేరు. కొంత మంది ఇండస్ట్రీలో మంచి పేరు పొందాలంటే జాతక రిత్యా పేరు మార్చుకోవాలని కూడా మార్చుకున్నారు. కారణం ఏదైనా మన టాలీవుడ్ లో స్టార్ డం సంపాదించిన హీరోయిన్లలో అనేక మందికి అసలు పేర్లు వేరే ఉన్నాయి. ఆ పేర్లతోనే పాపులర్ అయ్యారు. ఇండస్ట్రీకి వచ్చి తమ సొంత పేర్లు మార్చుకున్న హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.

సినిమా
సినిమా

స‌హ‌జ‌న‌టిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ జ‌య‌సుధ అస‌లు పేరు సుజాత‌. ఇక ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర‌వాత ద‌ర్శ‌కుడు దాస‌రినారాయ‌ణ రావు ఆమె పేరును జ‌య‌సుధ‌గా మ‌ర్చారు. అంతే కాకుండా టాప్ హీరోయిన్ గా ఎదిగిన హీరోయిన్ జ‌య‌ప్ర‌ద‌.. అయితే జ‌య‌ప్ర‌ద అస‌లు పేరు లలితా రాణి కానీ సినిమాల‌లోకి వ‌చ్చాకే పేరు మార్చుకున్నారు. అందాల తార సౌంద‌ర్య పేరు కూడా సౌంద‌ర్య కాద‌ట‌. ఆమె అస‌లు పేరు సౌమ్య కాగా స్వ‌రాష్ట్రం క‌ర్నాట‌క కానీ ఆమె తెలుగువారికే ఎంతో ద‌గ్గ‌ర‌య్యారు.

ఇక సినిమాల్లో హీరోయిన్ గానే కాకుండా ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపుతెచ్చుకున్న రోజా అస‌లు పేరు కూడా రోజా కాదు. ఆమె అస‌లు పేరు శ్రీల‌తా రెడ్డి కాగా సినిమాల్లోకి వ‌చ్చాక పేరు అంత క్యాచీగా లేద‌ని సీనియ‌ర్ న‌టుడు మ‌రియు రాజ‌కీయ నాయ‌కుడు శివ‌ప్రసాద్ రోజా మార్చార‌ట‌. ఇక హీరోయిన్ రంభ అస‌లు పేరు విజ‌య‌ల‌క్ష్మి కాగా రంభ గా మార్చుకుంది. అంతే కాకుండా టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి పేరు కూడా అనుష్క కాద‌ట‌. ఆమె నిక్ నేమ్ తో పాటూ అస‌లు పేరు కూడా స్వీటీ శెట్టినే కాగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాక సూప‌ర్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో నాగార్జున అనుష్క అని పేరు పెట్టార‌ట‌.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here