అందరి హీరోలకు భిన్నంగా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన అజిత్.. ఏంటంటే ?

- Advertisement -

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవాసరం లేదు. తమిళ లో స్టార్ హీరోగా ఉన్న అజిత్ కి… తెలుగు లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి హిట్ లుగా నిలిచాయి. అయితే స్టార్ హీరోలందరూ ఒక స్టైల్ లో ఉంటే అజిత్ మాత్రం అందరికీ డిఫరెంట్ అని చెప్పాలి. సినిమా ప్రమోషన్లకు, సోషల్ మీడియాకు కూడా అజిత్ దూరంగా ఉంటారు. అభిమానుల ప్రేమ, ఆశీస్సులు తనకు ఎల్లప్పుడూ ఉంటాయని వారు మంచి సినిమాలను ఎప్పుడూ ప్రేమిస్తారని అంటుంటారు.

అజిత్
అజిత్

తన సినిమాల షూటింగ్ లు కంప్లీట్ చేసుకోవడం.. ఫ్యామిలితో ట్రిప్స్ కి వెళ్ళడం.. బైక్ పై టూర్స్ కి వెళ్ళడం.. ఇదే ప్రపంచంగా అజిత్ ఉంటూ ఉంటారు. అజిత్ కి బైక్ రైడింగ్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. కాస్త ఖాళీ దొరికితే చాలు బైక్ పై చక్కర్లు కొడతారు. షూటింగ్‌ సమయంలో ఏమాత్రం గ్యాప్‌ దొరికిన బైకుపై చుట్టు పక్కల ఉండే ప్రాంతాలను చుట్టివస్తారు. కాగా త్వరలోనే అజిత్ 81 రోజుల్లో 7 ఖండాలు, 62 దేశాలను చుట్టేలా ఓ సుదీర్ఘ బైక్‌ జర్నీకి ప్రణాళిక రూపొందిస్తున్నారట. వరల్డ్ టూర్ కి సంబంధించి ముందస్తు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని సినీ వర్గాలలో టాక్ నడుస్తుంది. కాగా ఇప్పుడు తాజాగా అజిత్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది.

అందరు హీరోలు రకరకాల బిజినెస్ లలోకి దిగుతుంటే అజిత్ మాత్రం అందరికీ భిన్నంగా తనలా ఇంట్రస్ట్ ఉన్న రైడర్స్ కి ఏకే మోటో రైడ్ (AK Moto Ride) హెల్ప్ చేస్తుందంటూ అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. అడ్వెంచర్స్ ఎక్స్ ప్లోర్ చెయ్యడం అంటే ఇంట్రస్ట్ ఉన్న రైడర్స్ కోసం అజిత్ కుమార్ మోటార్ రైడ్ అనే సంస్థ వెల్కమ్ చేస్తుందంటున్నారు. ఇంట్రస్ట్ ఉన్న వాళ్లకి ట్రెయినింగ్, రైడింగ్ బైక్స్, రూట్ మ్యాప్స్ తో పాటు హై సేఫ్టీస్కిల్స్ ఉన్న ట్రైనర్స్ తో ట్రెయినింగ్ ప్రొవైడ్ చేస్తుందని సోషల్ మీడియా వేదికగా అజిత్ టీం తెలిపారు. ఇండియా లోనే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా తమ సంస్థ పనిచేస్తుందని త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు. దీంతో అజిత్ ఫ్యాన్స్ తల స్టైల్ ఏ వేరు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here