టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి Pragathi గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ప్రగతికి ఉన్న ఇమేజ్ చాలా డిఫరెంట్. తల్లిగా ప్రేమను పంచుతుంది.. అత్తగా శాడిజం చూపిస్తుంది.. ఏడుస్తుంది.. నవ్విస్తుంది. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో అన్ని రకాల ఎమోషన్స్‌ను ఈజ్‌తో చేయగలిగిన వారిలో ప్రగతి ( Actress Pragathi )ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. ప్రగతికి మామూలు ఫ్యాన్ బేస్ లేదు.

సినిమాల్లో ఎంత సౌమ్యంగా ఉంటుందో ప్రగతి.. బయట అంత యాక్టివ్‌గా ఉంటుంది. మాస్.. ఊర మాస్‌గా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో ప్రగతి హల్‌చల్ మామూలుగా ఉండదు. మిలీనియల్ యూత్‌లా ప్రగతి ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తరచూ తన ఫ్యాన్స్‌కు అప్డేట్స్ షేర్ చేస్తూ ఉంటుంది.

ప్రస్తుతం ప్రగతి తన భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. తన ఇద్దరు పిల్లల బాధ్యత చూసుకుంటోంది. ఓవైపు పిల్లల బాధ్యత చూసుకుంటూనే మరోవైపు సినిమాల్లో నటిస్తోంది. రీసెంట్‌గా సోషల్ మీడియాలో ప్రగతి ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో కాస్త ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
ప్రగతికి డాన్స్ అంటే చాలా ఇష్టం. చాలా సందర్భాల్లో ఆమె డాన్స్ చేస్తూ వీడియోలు పోస్టు చేసింది, అవి నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ప్రగతి డాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతుంటారు.రీసెంట్‌గా పోస్టు చేసిన వీడియోలో ప్రగతి డోలు మీద కూర్చొని డాన్స్ చేసింది. ఆమె చెల్లి పెళ్లి కావడంతో బరాత్‌లో డోలు మీద కూర్చుని తీన్మార్ స్టెప్పులు వేసింది.హొయ్ హొయ్ అంటూ అరుస్తూ రచ్చ రచ్చ చేసింది ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. డోలుపై ప్రగతి కూర్చోవడంతో వెనకాల ఉన్నవాడు బరువు మోయలేక చస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరో వ్యక్తేమో. డోలు వాయిస్తున్న వ్యక్తిని అయ్యో పాపం అన్నాడు. నిజంగా ఆ డోలు వాయించే వ్యక్తి చాలా స్ట్రాంగ్ అంటూ కామెంట్ పెట్టాడు. ఆంటీ రచ్చ మామూలుగా లేదుగా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ప్రగతి వీడియో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.