Actress Laya : అమెరికా లో హీరోయిన్ లయ చేస్తున్న ఉద్యోగం ఇదా..జీతం ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

- Advertisement -

Actress Laya : చూపులు తిప్పుకోలేని అందం, అద్భుతమైన నటన రెండు కలిస్తే దానికి వచ్చే రూపం లయ.బాలనటిగా కెరీర్ ని ప్రారంభించిన ఈమె, ఆ తర్వాత ‘స్వయంవరం’ అనే సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకులను పలకరించింది.ఆ సినిమా భారీ హిట్ అవ్వడమే కాదు, లయ కి ఉత్తమ నటిగా నంది అవార్డుని కూడా తెచ్చిపెట్టింది.ఆ సినిమా తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

Actress Laya
Actress Laya

వరుసగా అవకాశాలను సంపాదిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటిస్తూ అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది హీరోయిన్ లయ.ఒకానొక దశలో ఈమె ఏడాదికి 8 సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.అలా కెరీర్ లో పీక్ రేంజ్ ని ఎంజాయ్ చేస్తున్న సమయం లోనే అమెరికా కి చెందిన గణేష్ అనే డాక్టర్ ని పెళ్ళాడి అక్కడే స్థిరపడిపోయింది.అప్పటి నుండి ఈమె సినిమాల్లో మళ్ళీ కనిపించడం లేదు.

Heroines Laya
Heroines Laya

అయితే చాలా కాలం తర్వాత ఈమె ఇండియాకి తిరిగి వచ్చింది.ఈ సందర్భంగా ఆమె మీడియా కి అనేక ఇంటర్వ్యూస్ ఇచ్చింది.ఈ ఇంటర్వ్యూస్ లో ఆమె చెప్పిన ఎన్నో విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.పెళ్లి తర్వాత ఆమె 2011 వ సంవత్సరం నుండి ఒక ప్రముఖ MNC కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి గా పని చేసిందట.ఆమె నెల జీతం అక్షరాలా 12000 వేల అమెరికన్ డాలర్లు.ఇండియన్ కరెన్సీ ప్రకారం 9 లక్షల 40 వేల రూపాయిలు అన్నమాట.

- Advertisement -

అంటే సంవత్సరానికి కోటి రూపాయలకు పైమాటే.2017 వ సంవత్సరం వరకు ఉద్యోగం చేసిన లయ, ఆ తర్వాత ‘లయ బాలీవుడ్ డ్యాన్స్ అకాడమీ’ అనే డ్యాన్స్ స్కూల్ ని ప్రారంభించింది.ఈ స్కూల్ కొద్ది సంవత్సరాలు బాగానే నడిచినప్పటికీ, కరోనా సమయం లో మూసివెయ్యాల్సి వచ్చిందట.ఇలా ఆమె తన జీవితానికి సంబంధించి మనకెవ్వరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలు తెలియచేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here