నాగచైతన్య నాకేమీ ఇవ్వలేదు.. స్టేజ్ పైనే నోరుజారిన కృతి శెట్టి..

- Advertisement -

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కృతి శెట్టి.. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది. అంతేకాదు.. మొదటి సినిమాతోనే భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ మూవీ ఎఫెక్ట్ తెలుగులో బేబమ్మకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఈ సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు సినిమాలతో వరుసుగా డబుల్ హిట్స్ అందుకుంది. అయితే వరుస విజయాలతో దూసుకుపోతున్న కృతి శెట్టి ఇప్పుడు వరుస ప్లాపులను ఎదుర్కొంటుంది. ఇటీవల నితిన్ సరసన నటించిన మాచర్ల నియోజకవర్గం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ .. నాగచైతన్య నటిస్తోన్న కస్టడీ చిత్రంలో నటిస్తుంది.

కృతి శెట్టి
కృతి శెట్టి

నిన్న మొన్నటి వరకు క్రేజీ హీరోయిన్‌ అనే ట్యాగ్‌తో టాలీవుడ్‌లో తెగ వైరల్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు కాస్త సైలెంట్ అయిపోయారు. వరస ప్లాప్స్ రావడంతో.. కాస్త సైలెంట్ అయిపోయారు. కానీ తాజాగా కస్టడీతో సాలీడ్ హిట్ కొట్టేలానే కనిపిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్లో పాజిటివ్ వైబ్స్‌తో.. కనిపిస్తున్నారు. కానీ తాజాగా ఇదే మూవీ ప్రమోషన్లో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు తెలిసీ తెలియక ఆన్సర్ ఇచ్చి ఇప్పుడు నెట్టింట ట్రోల్ అవుతున్నారు. విమర్శల పాలవుతున్నారు. ఎస్ ! తాజాగా యువ సామ్రాట్ చైతో పాటు.. కస్టడీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్‌తో.. ప్రత్యేక సెక్షన్ ఏర్పాటు చేశారు.

ఇందులో కృతి నాగచైతన్య గురించి స్టేజ్ పైన మాట్లాడుతూ నోరుజారింది. ఈ విషయం ఇప్పుడు వైరలవుతోంది. సెక్షల్లో పాల్గొన్న కృతి.. ఉప్పెన తరువాత ఫెయిల్యూర్‌లో ఉన్న తనకు చై బంగార్రాజుతో సక్సెస్ ఇచ్చారు కదా.. అని గుర్తు చేస్తూ ఓ ప్రశ్న అడిగారు. దానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కానీ కృతి.. నేరుగా చై వంక తిరిగి నువ్వు నాకు సక్సెస్ ఇచ్చావా అన్నారు. దాంతో పాటే.. సక్సెస్ ఏ ఒక్కరు ఇవ్వలేరంటూ చెప్పారు. దీంతో అందరూ ఒక్క సారిగా షాకయ్యారు. దీంతో నాగచైతన్య తనకేమీ ఇవ్వలేదంటూ చెప్పకనే చెప్పింది ఈ ఉప్పెన భామ.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here