ఆ హీరోయిన్ అంటే పిచ్చి అంటూ అసలు విషయం బయటపెట్టిన నాగచైతన్య..!

- Advertisement -

ప్రస్తుత కాలంలో నాగచైతన్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తన భార్య సమంత నుంచి విడాకులు తీసుకున్న తర్వాత నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్న ఆయన ఈమధ్య శోభిత ధూళిపాళ్లతో కలిసి మీడియా కంటపడడంతో ఇక మళ్ళీ కొత్త వార్తలు పుట్టుకొచ్చాయి. దీంతో ఎక్కడ చూసిన సరే నాగచైతన్య పేరు వినిపిస్తూ ఉండడం గమనార్హం. మరీ ముఖ్యంగా ఆయన ఎక్కడికి వెళ్లినా.. ఏం మాట్లాడినా సరే దానిని సమంతాకు ఆపాదింపేస్తున్నారు.

నాగచైతన్య
నాగచైతన్య

ఆయన నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈసారి కచ్చితంగా హిట్టు కొట్టాలన్న ఉద్దేశంతో తమిళ డైరెక్టర్ వెంకట ప్రభు డైరెక్షన్లో కస్టడీ సినిమా చేస్తున్నారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. మే 12వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్యకు మీకు ఏ హీరోయిన్ అంటే క్రష్ అని యాంకర్ అడిగారు. దానికి ఆయన మాట్లాడుతూ ఈ మధ్య బాబీలోన్ అనే ఒక ఇంగ్లీష్ సినిమా చూశాను.

Margot Robbie

అందులో నటించిన మార్గట్ రాబీ పర్ఫామెన్స్ చూసి ఫిదా అయ్యాను. ఇక ఆమె అంటే క్రష్ ఏర్పడింది. ఆమెతో కలిసి ఒక్కసారైనా నటించాలని ఉంది అంటూ తన మనసులో మాట చెప్పాడు నాగచైతన్య. అయితే ఈ వీడియో కింద మాత్రం అందరూ శోభిత ధూళిపాళ్ల పేరును కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఈమధ్య ఆమెతో డేటింగ్ చేస్తున్నాడు అంటూ వార్తలు బాగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here