Actress Kasturi : ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి కస్తూరి..

- Advertisement -

Actress Kasturi : కస్తూరి తెలుగు తమిళ కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలలో నటించింది. తన అందం, అభినయంతో హీరోయిన్ గా నటించి మెప్పించింది.. ఆ తర్వాత కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమైంది.. మళ్లీ బిగ్ బాస్ తమిళ్లో కనిపించి ప్రేక్షకులకు దగ్గర అయింది గెస్ట్ గా అలరిస్తూ మాటీవీ లో ప్రసారమయ్యే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో అవకాశం కైవసం చేసుకుంది.. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో తులసిగా ప్రస్తుత గృహిణుల అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది కస్తూరి.. తాజాగా కస్తూరి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన హీరోల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Actress Kasthuri
Actress Kasthuri

కస్తూరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేటితరం హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని తెలిపింది. ఇద్దరిలో రెండు రకాల కారణాలతో తనకంటే ఇష్టమని తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎదిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ వర్స్టైల్ యాక్టర్ అని ఆయనకు ఏ పాత్ర ఇచ్చినా కానీ అవలీలగా చేసేస్తారు అంటూ కస్తూరి కితాబిచ్చారు. తారక్ నటన, డాన్స్ సూపర్.

Actress Kasthuri

అంతేకాకుండా జూనియర్ కష్టపడి పైకి వచ్చారని, కుటుంబం సపోర్టు లేకపోయినా, మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్నారని కస్తూరి అన్నారు. నందమూరి ఇంటి వారసుడైన నందమూరి కుటుంబం చిన్నప్పుడు ఎన్టీఆర్ ను దూరం పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఆ విషయాలు ఏమి పట్టించుకోకుండా తన స్వశక్తితో ఎదిగి పైకి వచ్చాడని తన టాలెంట్ తన కుటుంబానికి దగ్గర చేసిందని మళ్లీ ఆ కుటుంబానికి తారక్ అండగా నిలుస్తూ మంచి పేరు తెచ్చుకున్నారని కస్తూరి తెలిపారు. ప్రస్తుతం కస్తూరి జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అదే విధంగా కస్తూరి విజయ్ దేవరకొండ అంటే కూడా తనకి చాలా ఇష్టం అని తెలిపింది విజయ్ దేవరకొండ సెల్ఫ్ మేడ్ హీరో అని చెప్పారు విజయ్ గ్రీకు శిల్పంలా ఉంటాడని తన స్టైల్ యాక్టింగ్ అంటే కస్తూరికి ఇష్టమని వివరించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here