ఓం రౌత్ భారీ బడ్జెట్ తో తెరకెకెక్కించిన అది పురుష్ చిత్రం ఈనెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే . ఈ చిత్రం రామాయణం కథ అంశంతో తెరకెక్కించారని తెలుస్తుంది..ఇందులో ప్రభాస్ రాముడు పాత్ర లో కనిపించగా సీత పాత్ర లో కృతి సనన్ నటిస్తోంది. రావణాసుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు టీజర్ ట్రైలర్ లో ని పాత్రలు అందరిని కూడా బాగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అయినప్పటికీ కొంతమంది మాత్రం వీటి పైన నెగిటివ్ కామెంట్లు చేస్తూనే ఉన్నారు.

తాజాగా ‘ఆదిపురుష్’పోస్టర్‌పై నటి కస్తూరి విమర్శల వర్షం కురిపించారు. ప్రభాస్ లుక్ చూస్తుంటే కర్ణుడు గుర్తుకువస్తున్నారని ఆమె అన్నారు. శ్రీరాముడు, ఆయన సోదరుడు లక్ష్మణుడిని మీసాలతో చూపించడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘రామలక్ష్మణులను మీసాలు, గడ్డంతో చూపించిన సంప్రదాయం ఎక్కడైనా ఉందా? ఇలాంటి కలవరపెట్టే మార్పులను ఎందుకు చూపించారు. మరీ ముఖ్యంగా, (ప్రభాస్‌ను ఉద్దేశిస్తూ) తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది లెజెండ్స్ శ్రీరాముడి పాత్రను పూర్తిస్థాయి పరిపూర్ణతతో తెరపై చూపించారు. కానీ, ‘ఆదిపురుష్’లో ప్రభాస్ రాముడిగా కాకుండా కర్ణుడిగా కనిపిస్తున్నారు’’ అని ఆమె విమర్శించారు.

ఈ స్టార్ హీరోయిన్ వ్యాఖ్యలను కొందరు సమర్దిస్తుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. మొత్తానికి నటి కస్తూరి తాజా కామెంట్స్ తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. 90ల్లో తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న కస్తూరి ఆదిపురుష్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వీటిపై ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీసాలు, గడ్డంతో రాముడిని చూడటంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు.