Sathyaraj : ఆ విషయం లో హీరో సూర్య తండ్రి కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన ‘కట్టప్ప’ సత్యరాజ్.. చివరికి ఏమైందంటే!

- Advertisement -

Sathyaraj : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ అవ్వడం అంటే సాధారణమైన విషయం కాదు. ఎంతో కష్టపడాలి,ఎన్నో అవమానాలను ఎదురుకోవాలి, వచ్చిన ప్రతీ అవకాశం ని ఉపయోగించుకోవాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా ఇష్టం లేని వాళ్ళతో ప్రయాణం చెయ్యాలి, లక్ష్యం చేరుకునే వరకు ఇది తప్పదు. అలా ఎన్నో ఒడిదుడుగులను ఎదురుకొని ఇండస్ట్రీ లో సక్సెస్ అయిన హీరోలలో ఒకరు ‘సత్యరాజ్’.

Sathyaraj
Sathyaraj

కెరీర్ ప్రారంభం లో విలన్ పాత్రలతో బాగా ఫేమస్ అయిన సత్యరాజ్, ఆ తర్వాత హీరో గా కూడా గొప్పగా రాణించి అలనాటి స్టార్ హీరోలలో ఒకరిగా ఇండస్ట్రీ లో చలామణి అయ్యాడు. ఆ తర్వాత వయస్సు మీదకి వచ్చాక క్యారక్టర్ ఆర్టిస్టుగా మారి ఇండియాలోనే మోస్ట్ డిమాండ్ ఉన్న ఆర్టిస్టులతో ఒకడిగా చరిత్ర సృష్టించాడు. బాహుబలి సిరీస్ లో ఆయన పోషించిన ‘కట్టప్ప’ పాత్రకి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మన అందరం చూసాము.

అయితే సత్యరాజ్ కెరీర్ ప్రారంభం లో అవకాశాల కోసం చాలా మంది ఇంటి చుట్టూ తిరిగాడు. అప్పట్లో ప్రముఖ హీరో సూర్య తండ్రి శివ కుమార్ పెద్ద స్టార్, ఆయన చిత్రం లో చిన్న వేషం ఇవ్వమని సత్యరాజ్ ఆరోజుల్లో ప్రాధేయ పడేవాడట. ఒకానొక సందర్భం లో ఆయన కాళ్ళను కూడా పట్టుకొని బ్రతిమిలాడాడట. అలా అవకాశాలు సంపాదించిన సత్య రాజ్, నేడు ఒక్క రోజుకి 15 లక్షల రుపాయిల రెమ్యూనరేషన్ తీసుకునే ఆర్టిస్టులలో ఒకరిగా నిలిచాడు.

- Advertisement -

అలా సూర్య తండ్రి సత్యరాజ్ నేడు ఈ స్థాయిలో ఉండడానికి కారణం అయ్యాడట. ఇప్పటికీ తన జీవిత ప్రస్థానం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సూర్య తండ్రి శివ కుమార్ చేసిన సహాయం గురించి చెప్పుకోకుండా మాత్రం ఉండదట. అతని గురించి మాట్లాడినప్పుడల్లా సత్య రాజ్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇప్పటికీ కూడా సత్యరాజ్ ని సూర్య కుటుంబం సొంత ఫ్యామిలీ మెంబెర్ లాగానే చూస్తుందట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here