Brahmaji : టాలివుడ్ లోని పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు బ్రహ్మాజీ అందరికి తెలుసు..తన నటనతో.. చలాకీతనంతో.. కామెడీతో కౌంటర్లు వేస్తూ.. సెటైర్లు వేసే ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదని చెప్పాలి. ఇకపోతే స్టేజి మీద అయినా సోషల్ మీడియాలో అయినా సరే ఆయన వేసే కౌంటర్లకు నవ్వాగదు. తనకు అనవసరమైన వాటిలో కూడా తలదూరిస్తూ ఉంటాడు. అలా వార్తల్లో నిలుస్తుంటాడు..గత కొన్ని రోజుల క్రితం అనసూయ ఆంటీ వివాదం ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. ఇక దానికి కౌంటర్ గా బ్రహ్మాజీ.. నన్ను అంకుల్ అంటే.. పోలీస్ కేసు పెడతా.. అంటూ ట్వీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు..తాజాగా మరో వార్తతో హైలెట్ అవుతున్నాడు..

అసలు విషయానికొస్తే..తాజాగా విరూపాక్ష బ్యూటీ సంయుక్త మీనన్ ను కూడా ఆయన ఏడిపించారు. సాయి ధరంతేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన చిత్రం విరూపాక్ష. ఈనెల 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ మొదలు పెట్టిన మేకర్స్..ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆకట్టుకోవడంతోపాటు హీరోయిన్గా సంయుక్త కి కూడా మంచి పేరు వచ్చింది. ఈ నేపథ్యంలోనే సంయుక్త ట్విట్టర్ అభిమానులతో చిట్ చాట్ మొదలుపెట్టింది…
ఈ క్రమంలో ట్రైలర్ ఎలా ఉంది అని అడగ్గా.. అభిమానులతో పాటు బ్రహ్మాజీ కూడా తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చాడు. ట్రైలర్ నచ్చిందా చెప్పండి. అన్న ప్రశ్నకు.. ‘చాలా బాగుంది.. ప్లాటినం లెగ్ గారు’ అంటూ రిప్లై ఇచ్చారు. అరే ఏంటి బ్రహ్మీ గారు అంటూ సంయుక్త సిగ్గులు మొగ్గలు వేసింది. ఇక టాలీవుడ్ ఎంట్రీ తోనే పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ , బింబిసారా, సార్ ఇలా వరుసగా హిట్లు అందుకోవడంతో.. బ్రహ్మాజీ గోల్డెన్ లెగ్ బదులు ప్లాటినం లెగ్ అనేసాడు.. ఇక వీరిద్దరిని చూసిన అభిమానులు అన్న హీరోయిన్ తో పులిహోర కలిపేస్తున్నావా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.. అయితే ఇప్పుడు ఇది మరోసారి వైరల్ అవుతుంది.. అబ్బే.. బ్రాహ్మజీ నువ్వు చేసిందేమి బాగాలేదయ్యా.. ఇప్పుడు ఇది అవసరమా.. నీ ఏజ్ ఏంటి గేజ్ ఏంటి అంటూ దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు.. మరి దీనిపై బ్రహ్మాజీ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..