Samyuktha Menon : సీనియర్ నటుడు నాజర్ తో ‘సార్’ హీరోయిన్ సంయుక్త మీనన్ రొమాన్స్.. మండిపడుతున్న ఫ్యాన్స్

- Advertisement -

Samyuktha Menon : భీమ్లానాయక్ సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయమై, మంచి పాపులారిటీ ని తెచ్చుకొని, ఆ తర్వాత ‘భింబిసారా’ మరియు ‘సార్’ వంటివో సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్ అయ్యే దిశగా దూసుకుపోతున్న నటి సంయుక్త మీనన్.కేవలం అందం తో మాత్రమే కాదు, అభినయం కూడా రఫ్ఫాడించగలను అని తోలి సినిమా భీమ్లానాయక్ తోనే అందరికీ అర్థం అయ్యేలా చేసిన ఈమె ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.

samyuktha menon
samyuktha menon

స్టార్ హీరోలు సైతం ఈమెని తమ సినిమాలో తీసుకుంటే కచ్చితంగా హిట్ అవుతుంది అనే నమ్మకం తో ఉన్నారంటే ప్రస్తుతం ఈమె డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.టాలీవుడ్ లోకి అడుగుపెట్టకముందే ఈమె మలయాళం లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.అక్కడ ఈమె దాదాపుగా పది సినిమాలకు పైగా చేసింది.అంతే కాదు భీమ్లా నాయక్ కి ముందు తమిళం లో కూడా ఈమె మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

samyuktha menon Photos

ఇది ఇలా ఉండగా సంయుక్త మీనన్ ప్రముఖ సీనియర్ నటుడు నాజర్ తో చేసిన కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. వరుసగా హిట్స్ కొట్టి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిల్చిన హీరోయిన్ కాబట్టి కచ్చితంగా ఈమె గురించి నెటిజెన్స్ సోషల్ మీడియా లో వెతుకుతారు అనేది సర్వసాధారణం.అలా వెతుకుంటున్న సమయం లోనే 2021 వ సంవత్సరం లో ఆమె చేసిన తమిళ చిత్రం ‘ఎరిడా’ లోని కొన్ని సన్నివేశాలను అప్లోడ్ చేసారు నెటిజెన్స్.

- Advertisement -
samyuktha menon Stills

ఈ సినిమాలో సంయుక్త మీనన్ చాలా బోల్డ్ గా నటించింది. సీనియర్ క్యారక్టర్ ఆర్టిస్టు నాజర్ తో రొమాంటిక్ సన్నివేశాలు చెయ్యడానికి కూడా ఆమె ఏమాత్రం వెనకాడలేదు. ఆ సన్నివేశాలను చూసిన అభిమానులు ‘అబ్బో.. ఈమెలో ఇంత ఉందా’ అని ఆశ్చర్యపోక తప్పదు. ఆ సినిమాలోని ఒక్క సన్నివేశం మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here