Abhinav Gomatam : సినిమాల్లోకి రాకముందు ఈ కమెడియన్ ఎలాంటి పనులు చేసేవాడో తెలిస్తే కన్నీళ్లు ఆపుకోలేరు

- Advertisement -

Abhinav Gomatam : నేటి తరం యూత్ ఆడియన్స్ కి బాగా ఇష్టమైన సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’. తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో విశ్వక్ సేన్ ని ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం చేసిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. ఒక నలుగురి స్నేహితుల మధ్య జరిగిన ఈ కథని చూసి మన రియల్ లైఫ్ లోని సంఘటనలను కచ్చితం గా గుర్తు చేసుకుంటాం. ఈ సినిమాలో ప్రతీ ఒక్కరు ఎంతో సహజంగా నటించారు. ఈ చిత్రం ద్వారానే ప్రముఖ కమెడియన్ అభినవ్ గోమతమ్ తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు.

Abhinav Gomatam
Abhinav Gomatam

ఇతని కామెడీ టైమింగ్ ఈ చిత్రాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. ఈ సినిమాకి ముందే అభినవ్ గోమతం నాలుగు సినిమాల్లో నటించాడు. సుమంత్ హీరో గా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘మళ్లీ రావా ‘ చిత్రం తో వెలుగులోకి వచ్చాడు, ఆ తర్వాత చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు.

ఇప్పుడు ఈయన డిమాండ్ ఎలా ఉంది అంటే , ప్రతీ శుక్రవారం విడుదల అయ్యే సినిమాల్లో ఇతను కచ్చితంగా ఉండాల్సిందే. ఆ రేంజ్ కి ఎదిగిపోయాడు, ఈ ఏడాది ఇప్పటి వరకు ఈయన ‘విరూపాక్ష’, ‘స్పై’ వంటి చిత్రాల ద్వారా మన ముందుకు వచ్చాడు. ఇప్పుడు నవీన్ పొలిశెట్టి తో కలిసి నటించిన ‘మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి’ చిత్రం సెప్టెంబర్ 7 వ తారీఖున విడుదల అవ్వబోతుంది. వీటితో పాటు ఆయన డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ లో నటించి మంచి మార్కులే కొట్టేసాడు. ఈ సిరీస్ పెద్ద హిట్ అయ్యింది.

- Advertisement -

ఇదంతా పక్కన పెడితే అభినవ్ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన అబ్బాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఉద్యోగం దొరకక కొన్ని సంవత్సరాలు జీవనాధారం కోసం మల్టీప్లెక్స్ థియేటర్స్ లో పని చేసేవాడు. ఆ తర్వాత సినిమాల మీద మక్కువ తో గట్టిగా ట్రై చేసి, అవకాశాలు సంపాదించి నేడు ఈ స్థాయిలో నిలిచాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here