‘మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి’ మొట్టమొదటి రివ్యూ.. నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ అదుర్స్..కానీ!

- Advertisement -

‘జాతి రత్నాలు’ తర్వాత నవీన్ పొలిశెట్టి, ‘భాగమతి’ తర్వాత అనుష్క శెట్టి కలిసి నటించిన చిత్రం ‘మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి’. ఈ ఇద్దరు కూడా వెండితెర మీద కనిపించి చాలా సంవత్సరాలు అయ్యింది. నవీన్ పొలిశెట్టి రెండేళ్లు గ్యాప్ తీసుకుంటే, అనుష్క శెట్టి ఏకంగా 5 ఏళ్ళు గ్యాప్ తీసుకుంది. అలా ఈ ఇద్దరి క్రేజీ స్టార్స్ బాగా గ్యాప్ తీసుకొని నటించిన సినిమా కావడం తో ఈ మూవీ పై మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంది.

మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి
మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి

ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని అనుకోని కారణాల వల్ల షూటింగ్స్ వాయిదా పడుతూ ఎట్టకేలకు షూటింగ్ ని పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం అయ్యింది. సెప్టెంబర్ 7 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించి పాటలు , టీజర్ మరియు ట్రైలర్ అన్నీ విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ ని తెచ్చుకున్నాయి.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన మొదటి కాపీ ప్రివ్యూ షో నేడు కొంతమంది సినీ ప్రముఖుల సమక్షం లో ప్రసాద్ ల్యాబ్స్ లో వేశారు. దీనికి సంబంధించి టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఈ చిత్రం ఫన్నీ ఎలిమెంట్స్ నింపేసారట, నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ సినిమాలో ఉన్న ల్యాగ్ ని బాగా కవర్ చేసినట్టు తెలుస్తుంది. ఇక చాలా కాలం తర్వాత వెండితెర మీద కనిపించే అనుష్క ని చూసి అభిమానులు కచ్చితంగా మురిసిపోతారని చెప్తున్నారు.

- Advertisement -

అంత అందం గా ఆమె ఈ సినిమాలో కనిపించిందట. పని పాట లేకుండా ఉద్యోగం కోసం వెతుకుతున్న పోలిశెట్టి అనే అబ్బాయికి, చెఫ్ అయినా అనుష్క వద్ద ఉద్యోగం లభిస్తుంది. వీళ్లిద్దరి మధ్య జరిగిన కెమిస్ట్రీ మరియు లవ్ స్టోరీయే ఈ సినిమా. సినిమా పర్వాలేదు అనే రేంజ్ లో ఉంది కానీ , జాతి రత్నాలు రేంజ్ బ్లాక్ బస్టర్ అయ్యేంత ఛాన్స్ లేదట, మరి ఆడియన్స్ తీర్పు ఎలా ఉంటుందో చూద్దాం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here