Sara – Subhaman Gill – బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్, నటి అమృతా సింగ్‌ల కూతురిగా హిందీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సారా అలీఖాన్. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కలిసి కేదార్నాథ్ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సింబా, కూలీ నెం.1, లవ్ ఆజ్ కల్ 2, లేటెస్ట్గా అత్రంగీ రే సినిమాలతో తనకంటూ ఓ పేరు సంపాదించుకుంది.
తీసినవి అరడజను సినిమాలే అయినా ఈ బ్యూటీ తన రిలేషన్షిప్స్ వల్ల తరచూ లైమ్ లైట్లో ఉంటుంది. సినిమాల్లోకి రాకముందు ఓ రాజకీయనేత మనవడితో ప్రేమలో పడింది. కొంతకాలం తర్వాత ఆ రిలేషన్‌షిప్‌కి బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత బాలీవుడ్ యంగ్ హీరో ఇషాన్ ఖత్తర్‌తో లవ్‌లో పడినట్లు పుకార్లు వచ్చాయి. దీనిపై ఇప్పటికీ క్లారిటీ లేదు.
ఇక తన ఫస్ట్ కోస్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తనకు ఎప్పుడూ స్పెషలే అని చెప్పే సారా.. అతడితోనూ కొంతకాలం ప్రేమాయణం సాగించింది. ఏమైందో ఏమో మధ్యలోనే బ్రేకప్ అయిపోయింది. ఆ తర్వాత సుశాంత్ వేరే హీరోయిన్‌తో ప్రేమ, ఆత్మహత్య ఆ సంగతులన్నీ తెలిసినవే.
సుశాంత్ తర్వాత తన మరో కో స్టార్ కార్తీక్ ఆర్యన్‌తో రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈ జంట తరచూ కలిసి కనిపించడం.. ఓ టాక్ షోలో సారా ఎవరితో డేటింగ్ ఓకే అంటే కార్తీక్ పేరు చెప్పడంతో వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు మొదలయ్యాయి. కొంతకాలానికే ఈ రిలేషన్షిప్కూ బ్రేక్ పడింది.
కార్తీక్‌తో రిలేషన్ తర్వాత సారా చాలా రోజులు సింగిల్‌గానే ఉంది. ఈ క్రమంలోనే రీసెంట్గా తను మళ్లీ రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈసారి తన కో స్టార్ కాదండోయ్. అతడో ఇండియన్ స్టార్ క్రికెటర్. సారా అలీఖాన్-యంగ్ క్రికెటర్ శుభమన్ గిల్ తరచూ ఇద్దరు డిన్నర్ డేట్స్‌కి వెళ్లడం వల్ల వీరు రిలేషన్షిప్లో ఉన్నట్లు పుకార్లు మొదలయ్యాయి.
అయితే వీరు రిలేషన్షిప్లో ఉన్న మాట నిజమేనని ఇటీవల ప్రూవ్ అయింది. యంగ్ క్రికెటర్ శుభమన్ గిల్ ఇటీవల ఓ పంజాబీ టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ షో యాంకర్ గిల్‌ను.. సారా అలీఖాన్ తో మీరు డేటింగ్ చేస్తున్నారా? అనే ప్రశ్న అడగ్గా నాకు తెలియదంటూ మాట దాటేశాడు. ఆ తర్వాత హోస్ట్ కాస్త ఒత్తిడి తేవడంతో ఇరుక్కున శుభమన్.. ‘నేను డేటింగ్ లో ఉండొచ్చు.. ఉండకపోవచ్చు..’ అంటూ సమాధానమిచ్చాడు.
గిల్‌ను ఇరకాటంలో పడేయాలని మళ్లీ యాంకర్.. బాలీవుడ్లో అత్యంత ఫిట్‌గా ఉండే నటి ఎవరని ప్రశ్నించగా.. దీనికి శుభమన్ ‘సారా’ అంటూ బదులిచ్చాడు. దీంతో సారాతో డేటింగ్ విషయాన్ని శుభమన్ చెప్పకనే చెప్పేశాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
గతంలోనూ శుభమన్ గిల్ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ముద్దుల తనయ సారా టెండూల్కర్‌తో ప్రేమలో ఉన్నాడనే ప్రచారం జరిగింది. ఆ మధ్య వీరిద్దరు ఒకరి ఇన్ స్టాను ఒకరు ఫాలో అవడం.. ఫొటోలు పరస్పరం షేర్ చేసుకోవడం లాంటివి జరిగాయి. ఈ నేపథ్యంలోనే వారి మధ్య ప్రేమాయణం నడుస్తుందనే టాక్ కొన్ని నెలలపాటు నడిచింది.
కొద్ది రోజుల తర్వాత శుభమన్ గిల్ ‘దేవతలతో ప్రేమలో పడొద్దు’ అంటూ ఒక పోస్ట్ షేర్ చేశాడు. వీరివురి మధ్య బ్రేకప్ అయిందనే పుకార్లు వచ్చాయి. రీసెంట్గా తరచూ సారా అలీ ఖాన్‌తో డిన్నర్ డేట్స్‌కి వెళ్తుండటంతో వీళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందనే ప్రచారం జోరందుకుంది.