Hansika Motwani : సెగలు పుట్టించే ఫొటోషూట్​తో కైపెక్కిస్తున్న హన్సిక

- Advertisement -

సౌత్ బ్యూటీ హన్సిక మొత్వాని వివాహ సమయం దగ్గర పడుతోంది. అయినా ఈ బ్యూటీ వరుస ఫొటో షూట్లతో బిజీబిజీగా గడుపుతోంది. సోషల్ మీడియా వేదికగా Hansika Motwani గ్లామర్​ ఫొటోలను షేర్ చేస్తోంది. ఈ ఫొటోలు చూసిన కుర్రకారు ఈ యాపిల్ బ్యూటీపై మనసు పారేసుకుంటున్నారు.

హన్సిక తన గ్లామర్ షోతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ఘాటు అందాలతో యువకులకు పిచ్చెక్కిస్తోంది. లేటెస్ట్ ఫొటో షూట్​తో ఫ్యాన్స్​కి విజువల్ ట్రీట్ ఇచ్చింది. ఓ మేగజైన్ కోసం చేసిన ఫొటోషూట్​లో ఘాటుగా పోజులిస్తూ తన హాటు అందాలను వడ్డించింది. ఈ నయా ఫోటో షూట్‌లో హన్సిక బ్లాస్టింగ్‌ పోజులు హీట్​ పుట్టిస్తున్నాయి. చూపు తిప్పుకోలేని అందంతో హన్సిక మెస్మరైజ్‌ చేస్తోంది.

Hansika Motwani
Hansika Motwani

ఈ మేగజైన్​ ఫొటో షూట్​లో హన్సిక గ్లామర్ డోస్ పెంచింది. మత్తెక్కించే చూపుతో.. కైపెక్కించే అందంతో కుర్రకారు మతిపోగొట్టేస్తోంది. జీ జెట్స్ డిజిటల్‌ కవర్‌ పేజ్‌ కోసం గ్లామరస్‌ ఫోటో షూట్‌ చేసింది. బ్లాక్‌ ట్రెండీ వేర్‌లో రెచ్చిపోయింది. టైట్‌ ఫిట్‌లో అందాలు చూపిస్తూ రెచ్చగొట్టే పోజులిచ్చింది. ఈ ఫొటోలు చూసి యువకులు ఆమెపై మళ్లీ మనసు పారేసుకుంటున్నారు.

- Advertisement -

త్వరలోనే ఈ భామ పెళ్లి చేసుకోబోతుంది. ముంబయికి చెందిన వ్యాపారవేత్త సోహైల్‌ కథురియాని వివాహమాడనుంది. ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని చెప్పేసింది యాపిల్ బ్యూటీ. లండన్‌లోని ఈఫిల్‌ టవర్‌ వద్ద సోహైల్ తనకు ప్రపోజ్ చేసిన విషయాన్ని ఫ్యాన్స్​తో షేర్ చేసుకుంది. డిసెంబర్ 4న వీరి వివాహం జరగనున్నట్లు కోలివుడ్ కోడై కూస్తోంది.

జైపూర్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనున్నట్లు సమాచారం. ‘ముందోతా ఫోర్ట్‌ ప్యాలెస్‌’లో జరగనున్న ఈ వివాహా కార్యక్రమానికి సంబంధించిన ప్రసార హక్కుల్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ+హాట్‌స్టార్‌ భారీధరకు కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అటు డిస్నీ కానీ ఇటు హన్సిక కానీ అధికారికంగా ధ్రువీకరించలేదు. పెళ్లి మొత్తాన్ని లైవ్‌ ఇస్తారా.. లేదంటే పెళ్లి జరిగాక కొన్నిరోజులకు డాక్యుమెంటరీ రూపంలో స్ట్రీమింగ్‌ అందుబాటులో ఉంచుతారా అన్నది కూడా తెలియాల్సి ఉంది.

డిసెంబర్‌ 2 సూఫీ నైట్‌తో వివాహ వేడుక ప్రారంభం కానుంది. 3వ తేదీన మెహందీ, సంగీత్‌ నిర్వహించనున్నారు. 4వ తేదీన హల్దీ జరగనుండగా అదే రోజు సాయంత్రం కుటుంబసభ్యుల సమక్షంలో ఈ జంట ఒక్కటికానున్నారు. దీనికోసం ఈ హోటల్‌లోని అన్ని గదులు, సూట్లను బుక్‌ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ వార్త నిజమేనని.. తమ అభిమాన కథానాయిక పెళ్లిని వీక్షించే అవకాశం రానుండడంతో డిజిటల్‌ ప్రేక్షకులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

బాలనటిగా కెరీర్‌ ప్రారంభించి కొద్ది కాలంలోనే పాపులారిటీ సంపాదించిన హన్సిక మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం ఆమె నటించిన ‘పార్ట్‌నర్‌’, ‘105 మినిట్స్‌’ చిత్రాల షూటింగ్‌ పూర్తవగా.. తెలుగులో ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’, తమిళంలో నాలుగు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. పెళ్లి తర్వాత ఆమె సినిమాలు చేస్తుందా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆమె సినిమాలకు గుడ్‌ చెప్పబోతుందా? అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here