Siddharth Aditi Rao : హీరో సిద్దార్థ్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బొమ్మరిల్లు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.. అయితే ఈ మధ్య సినిమాల కన్నా ఎక్కువగా ఈ మధ్య వార్తల్లో నిలుస్తున్నాడు.. ఈ మధ్య అతిధి రావు తో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అలాగే ఈ మధ్యకాలంలో శర్వానంద్ ఎంగేజ్మెంట్ కి కూడా సిద్ధార్థ్ అతిథి ఇద్దరు కలిసి రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీరు కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. కానీ వారిద్దరికీ పెళ్లి వద్దంట సహజీవనమే చాలని అన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి..
బాయ్స్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరో కొద్ది రోజుల్లోనే టాలీవుడ్ లో లవర్ బాయ్ గా మారిపోయారు. ఈయన నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, చుక్కల్లో చంద్రుడు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్ వంటి సినిమాల ద్వారా ఈయన తెలుగు ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఇప్పటికే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా అంటూ చాలామంది వారి సన్నిహితులు చెప్పుకొచ్చారు. అయితే సిద్ధార్థ్ ఇండస్ట్రీకి రాకముందే మేఘన అనే అమ్మాయితో పెళ్లయింది. కానీ నాలుగు సంవత్సరాలకే విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత ఇంకొంతమంది హీరోయిన్లతో కూడా సిద్ధార్థ్ ప్రేమాయణం నడిపించారు.. మీడియాలో కనిపిస్తు రచ్చ చేస్తున్నారు జంట.. అయితే అదితి కి కూడా ఇప్పటికే పెళ్లై విడాకులు అయ్యాయి. మహాసముద్రం సినిమా చేసే టైంలో సిద్ధార్థ్ అదితి ఇద్దరు ప్రేమలో పడ్డట్టు సమాచారం. అయితే వీరిద్దరి గురించి తెలిసిన కొంత మంది సన్నిహితులు వీళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నది నిజమే కానీ పెళ్లి కలిసి రాదనీ చేసుకోరని వారి సన్నిహితులు చెప్తున్నారు. ఇదేం ట్విస్ట్ అని జనాలు అంటున్నారు.. మరి నిజమేంటో తెలియాల్సి ఉంది.