Michael Collections : స్టార్ హీరో కి కావాల్సిన అన్ని లక్షణాలు పెట్టుకొని అదృష్టం కలిసి రాక సరైన హిట్టు లేక ఇప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని సంపాదించుకోలేక పోయిన హీరో సందీప్ కిషన్.ఆయన చేసే ప్రతీ సినిమాలోనూ ఒక వైవిద్యం ఉండాలని కోరుకుంటాడు, కానీ అవి ఫైనల్ గా వర్కౌట్ అవ్వక బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్స్ గా నిలిచాయి.
ఈసారి కొడితే గట్టిగ కొట్టాలనే కసితో పాన్ ఇండియా రేంజ్ స్కేల్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన ‘మైఖేల్’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదలైంది. ఆయన గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా కోసం ప్రేక్షకులు కాస్త ఆసక్తిగా ఎదురు చూసారు.. పాన్ ఇండియన్ సినిమా అంటూ ప్రమోట్ చేసుకోవడం తో పాటుగా భారీ తారాగణం ఉండడం వల్ల ఈ సినిమాపై హైప్ ఏర్పడింది.టాక్ కూడా డీసెంట్ గా రావడం తో ఓపెనింగ్స్ ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చాయి.
మార్నింగ్ షోస్ నుండే డీసెంట్ స్థాయి ఆక్యుపెన్సీలతో మొదలైన ఈ సినిమా,టాక్ కాస్త పాజిటివ్ గా రావడం తో మ్యాట్నీస్ నుండి కలెక్షన్స్ ఇంకా కాస్త మెరుగుపడ్డాయి.. మిగిలిన బాషలలో వసూళ్లు పెద్దగా ఏమి రాకపోయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మరియు ఓవర్సీస్ లో మంచి ఓపెనింగ్స్ ని దక్కించుకుంది..ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి రోజు కేవలం నైజాం ప్రాంతం నుండే కోటి 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
అంటే షేర్ లెక్కలోకి వేస్తే సుమారుగా కోటి రూపాయిల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ మొత్తం మీద మైఖేల్ సినిమా రెండు కోట్ల రూపాయిల వరకు లాభాలు వచ్చాయట.ఇది సందీప్ కిషన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి రెండు కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు..ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ రైట్స్ దాదాపుగా 8 కోట్ల రూపాయలకు జరిగింది..ఫుల్ రన్ అది రికవర్ చేస్తుందో లేదో చూడాలి.