Anchor Suma గురించి ఎంత చెప్పిన తక్కువే.. మలయాళి అయినా కూడా తెలుగు అనర్గలంగ మాట్లాడుతుంది.. బుల్లితెరపై ఈమె లెజెండ్ యాంకర్.. సుమ చేస్తున్న ఏ షో అయిన కూడా హిట్ అవ్వాల్సిందే.. సుమ యాంకరింగ్ మాత్రమే కాదండి అడిగిన వారికీ లేదనకుండా సాయం చేస్తుంది..ఎవరికీ తెలియని విషయమేంటంటే.. ఓ 30 ఆడపిల్లలను చదివిస్తుందట.. ఈ విషయం విన్న వారంతా శభాష్ అని మెచ్చుకుంటున్నారు. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
నిజానికి ఈ అమ్మడు మలయాళ అమ్మాయి అయినా.. తెలుగువారికంటే స్పస్టమైన తెలుగు మాట్లాడుతూ.. యాంకర్ గా స్టార్ డమ్ తో దూసుకుపోతోంది సుమ కనకాల. సుమ గురించి మన తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాంకర్ గా ఇంత లాంగ్ టైమ్ ఎంటర్టైన్ చేసిన వారు ఇంకెవరూ లేరనే చెప్పాలి. సుమతో కెరీర్ స్టార్ట్ చేసిన వారు.. సుమ తరువాత యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్లంతా ఎప్పుడో పక్కకు వెళ్లిపోయారు.. కానీ సుమ మాత్రం అప్పటి నుంచి ఇప్పటివరకు ఏలుతుంది.. బుల్లితెరపై రకరకాల షోలు చేస్తూ అందరి ఫ్యామిలీ లో ఒకటైంది.. అందరికి సుమక్క అయ్యింది.
స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకోవడం తో పాటు బాగా ఆస్తులు కూడా సంపాదించింది. అంతే కాదు తనను ఇంత స్టార్ ను చేసిన వారికి ఏదొ ఒకటి చేయాలనుకున్న సుమ మంచి మనసు చాటుకుంది. నలుగురికి సాయపడాలని సంకల్పించింది. ఇక యాంకర్ సుమ మొన్నీమధ్య సుమ మద్రాస్ ఐఐటీ కాలేజీకి వెళ్ళింది.
అక్కడ స్టూడెంట్స్ అడిగిన ఫన్నీ క్వశ్చన్స్ కు సుమ ఫన్నీ గా సమాధానాలు ఇచ్చింది. నన్ను ఇష్టపడి ఇంత దాన్ని చేసిన ప్రేక్షకుల కోసం నేను కూడా ఎంతో కొంత చేయాలి అనుకున్నా. లేదంటే లావయిపోతానేమో అని భయం వేసింది అంటూ విషయాన్ని బయటపెట్టింది.. నా వంతుగా 30 మంది స్టూడెంట్స్ ని అడాప్ట్ చేసుకుని చదివిస్తున్నాను.
వాళ్ళు బాగా సెటిల్ అయ్యే వరకు వాళ్ల బాధ్యత నాదే.. నేను వాళ్ళతోనే ఉంటాను. అన్నారు. అంతే కాదు ఇప్పటికే అమెరికాలో ఉన్న ఎఫ్ ఐ ఏ సంస్థ వాళ్ళు మాతో కలిసి పనిచేస్తున్నారు.. వారితో పాటు జైపూర్ లింబ్స్ డొనేట్ చేశారు అంటూ సుమ చెప్పుకొచ్చింది.. ఆమె చేసిన మంచి పనికి ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది.. సుమ ఇప్పుడు నిజంగానే లెజెండ్ అయ్యింది.. సుమక్క నువ్వు గ్రేట్ అంతే.. అంటూ ఆమె చేసిన పనికి షాక్ అవ్వడం మాత్రమే ఆమెకు వీరాభిమానులు అవుతున్నారు.