Tollywood Hero’s : బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటున్న స్టార్ హీరోలు వీళ్ళే..!

- Advertisement -

Tollywood Hero’s చిత్ర పరిశ్రమలో సక్సెస్ ను సాధించాలన్నా, బాక్సఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చెయ్యాలన్నా బ్యాక్ బ్యాక్ హిట్ సినిమాలు ఖాతాలో పడాల్సిందే.. కొంతమంది హీరోలకు ఎంత కష్టపడినా సక్సెస్ సొంతం కాకపోతే మరి కొందరు హీరోలకు మాత్రం అదృష్టం కలిసొచ్చి సులువుగానే సక్సెస్ దక్కుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది.. వాటికి రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుంది.. ఈ మధ్య వస్తున్న ఆ సినిమాలు భారీ విజయాన్ని కూడా అందుకుంటున్నాయి.

Tollywood Hero's
Tollywood Hero’s

ఇక డైరెక్టర్లు కూడా అలాంటి సినిమాలనే చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబుకు వరుస విజయాలు సొంతమవుతున్నాయి. సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట సినిమాల విజయాలతో మహేష్ బాబు మార్కెట్ ఊహించని రేంజ్ లో పెరిగింది.

త్రివిక్రమ్ , రాజమౌళి సినిమాలతో మహేష్ బాబు నటుడిగా మరో మెట్టు పైకి ఎదగడంతో పాటు అంచనాలను మించి సక్సెస్ ను సొంతం చేసుకుంటారని కొంతమంది చెబుతున్నారు.. ఇప్పుడు వస్తున్న సినిమాలు కూడా భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి..గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య విజయాలతో నటుడిగా చిరంజీవి ఇతర హీరోలకు షాకిస్తున్నారు. వాల్తేరు వీరయ్య ఏకంగా 250 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తుండటం గమనార్హం.

- Advertisement -
Chiranjeevi Balakrishna

భోళా శంకర్ తో చిరంజీవి హ్యాట్రిక్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో సక్సెస్ ను సొంతం చేసుకున్న బాలయ్య నెక్స్ట్ సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకుంటారేమో చూడాలి..ఇక తారక్ కూడా టెంపర్ నుంచి వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు..ఈ స్టార్ హీరో ఆర్.ఆర్.ఆర్ వరకు రికార్డులు క్రియేట్ చేసే రేంజ్ లో సక్సెస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.

వకీల్ సాబ్, భీమ్లా నాయక్ విజయాలతో పవన్ కళ్యాణ్ అల వైకుంఠపురములో, పుష్ప ది రైజ్ విజయాలతో అల్లు అర్జున్ కూడా వరుస విజయాలతో కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. మరి కొందరు హీరోలకు కూడా విజయాలు దక్కుతున్నా వరుసగా సక్సెస్ లు రావడం లేదని తెలుస్తుంది.. విజయ్ దేవరకొండ,రానా, ప్రభాస్, గోపీచంద్ లు భారీ బడ్జెట్ సినిమాలు తీసినా కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here