OG Movie : పవన్ కళ్యాణ్ #OG మూవీ లో హీరోయిన్ ఆమేనా? ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో

- Advertisement -

OG Movie : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం #OG.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లైనప్ లో చాలా సినిమాలు ఉన్నాయి.. కానీ అభిమానులకు ఈ చిత్రమే ఎందుకు అంత ప్రత్యేకం అంటే డైరెక్టర్ సుజిత్ అవ్వడం వల్లే.. సుజిత్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని.. ఒక వీరాభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో , వాటి ఫలితాలు ఎలా ఉంటాయో గతం లో మనం చాలాసార్లు చూసాము.

Pawan kalyan
Pawan kalyan OG Movie

#OG కూడా అలాగే ఉండబోతుందని అభిమానుల నమ్మకం..ఇక ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు నేడు అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగాయి..ఈ పూజ కార్యక్రమానికి అల్లు అరవింద్ , దిల్ రాజు మరియు సురేష్ బాబు వంటి నిర్మాతలు ముఖ్య అతిథి గా హాజరయ్యారు.. దీనికి సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Pawan kalyan OG Movie

ఇక ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి ఒకసారి వెళ్తే థమన్ సంగీతం అందిసున్నాడు.. #RRR తో ఆస్కార్ రేంజ్ కి మన తెలుగు సినిమాని తీసుకెళ్లిన డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా చాలామంది పేర్లు వినిపించినా..ఫైనల్ గా ప్రియాంక మోహన్ ని ఖరారు చేసినట్టు తెలుస్తుంది.. ప్రియాంక మోహన్ అంటే ‘డాక్టర్’ సినిమాలో హీరోయిన్ మీ అందరికి గుర్తుంది కదా..ఆమె అన్నమాట.

- Advertisement -
Pawan kalyan OG Movie Stills

కథ రీత్యా ఇంకో హీరోయిన్ కూడా ఇందులో నటించేందుకు స్కోప్ ఉందట.. అంతే కాకుండా ఈ చిత్రం లో బాలీవుడ్ హీరోయిన్ టబు, అనుపమ్ ఖేర్ మరియు కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి కూడా నటించబోతున్నట్టు సమాచారం.. త్వరలోనే ఈ వివరాలను అధికారికంగా ప్రకటించబోతుంది మూవీ టీం.. ఫిలిం నగర్ లో వినిపిస్తున్న మరో వార్త ఏమిటంటే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారట.. దీనికి సంబంధించి మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.

Pawan kalyan OG Movie Opening
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here