Dhamaka Movie: మాస్ మహారాజ రవితేజ టైం ప్రస్తుతం మామూలు రేంజ్ లో లేదు..ఆయన పట్టిందల్లా బంగారం లాగ మారిపోతుంది.. గత ఏడాది డిసెంబర్ 23 వ తారీఖున విడుదలైన ధమాకా సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడుతూనే ఉంది..ఒక మామూలు యావరేజి సినిమా ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని బహుశా రవితేజ కూడా ఊహించి ఉండదు..ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది.
ఈ సినిమాకి ముందు రవితేజ కి రెండు డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు వచ్చాయి..వాటిల్లో ‘ఖిలాడీ’ చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోయినప్పటికీ..రామారావు ఆన్ డ్యూటీ కి మాత్రం కనీస స్థాయి వసూళ్లు కూడా రాలేదు..అలా స్థాయి నుండి ఇప్పుడు వరుసగా రెండు బ్యాక్ 2 బ్యాక్ సూపర్ హిట్ హిట్స్ కొట్టడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇది ఇలా ఉండగా సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు కొత్త సినిమాల వైపే జనాలు ఎక్కువగా మొగ్గు చూపిస్తారు.. కానీ ‘ధమాకా‘ చిత్రం సంక్రాంతి సెలవుల్లో కూడా దుమ్ము లేపేసింది.. వైజాగ్ వంటి ప్రాంతాలలో ఈ సినిమా కొత్తగా విడుదలైన ‘వీర సింహా రెడ్డి‘ చిత్రాన్ని సైతం డామినెటే చేసింది అంటే మామూలు విషయం కాదు..గాజువాక లో సంక్రాంతి పండుగ సమయం లో ‘వీర సింహా రెడ్డి’ కి హౌస్ ఫుల్స్ పడలేదు కానీ, పక్కనే ఉన్న ‘ధమాకా’ చిత్రానికి మాత్రం హౌస్ ఫుల్స్ పడ్డాయి.
ఇది నిజంగా ఎవ్వరు ఊహించినది.. సంక్రాంతి పండుగకి ముందు 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం , సంక్రాంతి తర్వాత 42 కోట్ల రూపాయలకు చేరుకుంది.. అంటే ఆ నాలుగు రోజుల్లో ఈ సినిమాకి రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి అన్నమాట.. ఇది చాలా రేర్ ఫీట్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు.