Naga Chaitanya – Sobhita : సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎప్పుడూ జనాల మధ్యే ఉండాల్సి వస్తుంది. సినీ నటులు ఏం చేసినా.. ఎటెళ్లినా.. ఎవరిని కలిసినా.. ఫ్యాన్స్ ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. ఇక వాళ్ల సోషల్ మీడియా ఖాతాలనైతే మైక్రోస్కోప్ పెట్టి మరీ జల్లెడ పడతారు. ఒకపోస్టు పెడితే.. దాన్ని పోస్టుమార్టం చేసి మరి అందులో ఆంతర్యానికి కొన్నిసార్లు కొత్త అర్థం చెబుతారు. అందుకే కొంత మంది సెలబ్రిటీలు వాళ్ల పర్సనల్ లైఫ్ గురించి అంతగా సోషల్ మీడియాలో షేర్ చేసుకోరు.
అలా టాలీవుడ్ లో పర్సనల్ లైఫ్ ను కాస్త ప్రైవేట్ గా మెయింటైన్ చేసే వాళ్లలో అక్కినేని హీరో నాగచైతన్య ముందుంటాడు. తాను తన సినిమాలు, బిజినెస్, బ్రాండ్, స్పోర్ట్స్ గురించిన విషయాలు తప్ప తన పర్సనల్ లైఫ్ గురించి అసలు నెట్టింట షేర్ చేయడు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ యంగ్ హీరో.. కొంత సమయంలోనే టాలీవుడ్ లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.
వరుస సినిమాలు చేస్తూ.. హిట్ ల మీద హిట్ లు కొడుతూ కెరీర్ లో పీక్ లో ఉన్నప్పుడు తన కో-స్టార్ సమంత రుత్ ప్రభును పెళ్లాడాడు. కొన్నేళ్లు ఈ జంట టాలీవుడ్ లో పవర్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ జంటను చూసి కుళ్లుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ ఏమైందో ఏమో… సడన్ గా ఓ రోజు మేము ఇద్దరం విడిపోతున్నామంటూ నెట్టింట ఓ పోస్టు పెట్టి ప్రేక్షకుల గుండెల్లో బాంబ్ పేల్చారు. ఆ మంట నుంచి ఇప్పటికీ చాలా మంది తేరుకోలేకపోతున్నారు.
ఈ ఇద్దరు విడాకుల తర్వాత ఎవరి లైఫ్ లో వాళ్లు మూవ్ ఆన్ అయ్యారు. అయితే కొన్ని రోజుల నుంచి నాగచైతన్య, టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. వీళ్లిద్దరూ కలిసి విదేశాల్లో విహారించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. దాంతో వీరిద్దరి మధ్య నిజంగానే ఏదో ఉందంటూ అందరూ మాట్లాడుకోవడం షురూ అయింది. ఈ ఇద్దరు మాత్రం దాని గురించి స్పందించలేదు. కొన్నాళ్లకు ఆ రూమర్స్ మరుగున పడిపోయాయి.
కానీ తాజాగా మరోసారి ఈ ఇద్దరి ముచ్చట లైమ్ లైట్ లోకి వచ్చింది. వీళ్ల మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటూ నెట్టింట చర్చ షురూ అయింది. అందుకు కారణం ఒకే ఒక్క లైక్. చైతన్య ఇటీవల ఇన్ స్టాలో సన్ సెట్ ను ఎంజాయ్ చేస్తున్న పిక్ షేర్ చేశాడు. ఆ ఫొటోకు శోభిత వెంటనే లైక్ కొట్టింది. దీంతో ఇప్పుడు ఆ లైక్ హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇద్దరు సీక్రెట్ గా రిలేషన్ షిప్ లో ఉన్నారని నెట్టింట్లో డిబేట్ నడుస్తోంది. మరికొందరేమో లైక్ కొట్టినంత మాత్రాన ఏదో ఉన్నట్టా అని రూమర్స్ ను కొట్టిపారేస్తున్నారు. ఏదైనా ఈ విషయంపై చైతూ, శోభిత క్లారిటీగా స్టేట్ మెంట్ ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు.