Pushpa : యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన “ఊ అంటావా మావ” పాట

- Advertisement -

Pushpa : సినీ పరిశ్రమలో ప్రతేడాది ఎన్నో వందల సినిమాలు తెరకెక్కుతుంటాయి. కొన్ని సినిమాలు హిట్ అవుతాయి. మరికొన్ని సినిమాలు ఫట్ అవుతాయి. ఏ సినిమా హిట్ అవుతుంది ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో చెప్పడం కష్టం. .. కానీ కచ్చితంగా హిట్ కావాలనే మేకర్స్ సినిమాలను రూపొందిస్తుంటారు. ఇప్పటి సినిమాల్లో కుర్రాళ్లను ఆకట్టుకునేందుకు ఐటమ్ సాంగ్ మాత్రం కంపల్సరీగా ఉండాల్సిందే. సినిమాలో ఆరు పాటలున్న ఐదు పాటలు మినహా ఒక్క ఐటెం సాంగ్ కచ్చితంగా ఉంటుంది . ఆ ఒక్క పాట కుర్రాళ్లకు మెంటల్ ఎక్కించేస్తుంది.

కొన్ని కొన్ని సార్లు నాటి పదాలతో కైపెక్కిచ్చేస్తూ ఉంటారు సంగీత దర్శకులు. కాగా సినిమా ఇండస్ట్రీలోనే సెన్సేషనల్ రికార్డ్ సృష్టించింది సమంత. ఇరవై ఏళ్ల తన కెరీర్ లో ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ చేసింది సమంత. అది పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ. టాలీవుడ్ ఇండస్ట్రీలో లెక్కల మాస్టర్ గా పాపులారిటీ సంపాదించుకునన్న సుకుమార్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటించి ఆకట్టుకుంది.

Pushpa
Pushpa

అయితే ఈ సినిమాలో రష్మిక కన్నా క్రేజీ ఫాలోయింగ్ దక్కించుకుంది సమంత . ఫస్ట్ టైం కెరియర్ లోనే ఐటెం సాంగ్ నటించి సెన్సేషనల్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ .. చంద్రబోస్ లిరిక్స్ ఈ పాటకు హైలైట్ గా నిలిచాయి. ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ అనే లిరిక్స్ తో దేశాన్ని ఓ ఊపు ఊపేసింది. ఇప్పటికీ ఈ పాట పలు ఫంక్షన్స్ లో మారుమ్రోగిపోతుంది ..అంటే కారణం సమంత హాట్ పర్ఫామెన్స్ అనే చెప్పాలి . తాజాగా ఈ పాట సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసింది. ఊ అంటావా మామ పాట తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఐటెం సాంగ్స్ వచ్చాయి . కానీ ఏది కూడా ఈ పాట రికార్డులను బ్రేక్ చేయలేకపోయింది. ఈ పాట అప్పట్లోనే భారీ స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది. ఈ పాట రిలీజ్ అయిన 68 రోజుల్లోనే యూట్యూబ్ లో 20 కోట్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. ఇప్పటివరకు ఈ పాట దక్కించుకున్నన్ని వ్యూస్ మరే పాట దక్కించుకోలేకపోయింది.

- Advertisement -

యూట్యూబ్లో ఇంత తక్కువ టైంలో అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అలా వైకుంఠపురం లోని బుట్ట బొమ్మ సాంగ్ 20 కోట్ల వ్యూయ్స్ దక్కించుకుంది. కానీ 95 రోజులు టైం తీసుకుంది . ఇటీవల వచ్చిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడత పెట్టే సాంగ్ కూడా 20 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. కానీ 78 రోజుల సమయం పట్టింది . కేవలం 68 రోజుల్లోనే సమంత ఊ అంటావా మావ పాట 20 కోట్ల వ్యూస్ దక్కించుకుని సోషల్ మీడియాలో సెన్సేషనల్ రికార్డ్స్ నెలకొల్పింది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here