Malaika Arora : 50 ఏళ్లు దాటినా యంగ్ హీరోయిన్లకు పోటీనిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది బీ టౌన్ బ్యూటీ మలైకా అరోరా. వయసు శరీరానికి కానీ మనసుకు కాదన్నట్లుగా ఈ భామ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఐదు పదుల వయసులోనూ తనదైన అందం నెటిజన్లను కవ్విస్తూ ఉంటుంది. ఈ భామ సినిమాలేం చేయకపోయినా నిత్యం లైమ్ లైట్ లో ఉంటుంది. హిందీలో పలు రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇక ఈ భామ సోషల్ మీడియా ప్రొఫైల్ సూపర్ పాపులర్. అంతే గాక మలైకా లవ్ లైఫ్ కూడా చాలా పాపులర్. తనకంటే 12 సంవత్సరాలు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తూ ఈ జంట టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.
ఈ భామ తన మొదటి భర్త అర్భాజ్ ఖాన్ కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అర్భాన్ – మలైకాలకు అర్హాన్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. ఈ తల్లీకొడుకులు ఇటీవలే ఓ పాడ్‌కాస్ట్ ‘డంబ్ బిర్యానీ’లో కనిపించారు. అయితే ఈ పాడ్ కాస్ట్ లో మదర్-సన్ సంభాషణ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. ఇంతకీ అందులో వీళ్లిద్దరు మాట్లాడిన విషయమేంటి.. అది ఎందుకు ఇంత రచ్చ అవుతోంది
వోడ్‌కాస్ట్ రెండో ఎపిసోడ్‌లో మలైకా తన కుమారుడు అర్హాన్‌తో సంభాషించింది. అర్హాన్ ని మలైకా ఊహించని ఒక ప్రశ్న అడిగింది. ఆర్ యూ వర్జిన్.. నీ వర్జినిటీ (శీలాన్ని) ఎప్పుడు కోల్పోయావు? అని అర్హాన్ ను అడగ్గా.. ఆ ప్రశ్నకు ఆ కుర్రాడు షాక్ అయ్యాడు. అర్హాన్ దానికి సమాధానం ఇవ్వడానికి తటపటాయిస్తుంటే.. మలైకా మాత్రం ఆన్సర్ కోసం పట్టుబడింది. అయితే ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
కొందరు నెటిజన్లు ఈ తల్లీకొడుకులు చాలా మోడ్రన్ అని అనగా.. సనాతన్ ధర్మాన్ని భ్రష్ఠు పట్టిస్తున్నారని ఇంకొందరు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి పాశ్చాత్య పోకడలను అసలు ఎంకరేజ్ చేయొద్దంటూ మండిపడుతున్నారు. ఇంకొందేమో అర్హాన్ కి గోప్యత లేకుండా చేయడం సరికాదని మలైకాను వారించారు. కారణం ఏదైనా కానీ ఇప్పుడు మలైకా ప్రశ్నపై నెట్టింట పెద్ద డిబేట్ కొనసాగుతోంది.
ఈ వీడియోలో అర్హాన్ ఖాన్ తన తల్లిని మ్యారేజ్ ప్లాన్ గురించి అడుగుతాడు. మలైకా అరోరా తన కొడుకు ప్రశ్నకు ఎగతాళిగా స్పందిస్తూ, ”నువ్వు నిజాయితీగా ఉంటావని అనుకుంటున్నావా? ఎందుకంటే నేను చాలా స్పైసీగా ఉంటాను” అనే వ్యాఖ్యలు ఈ వీడియోలో కనిపించాయి. ఇకపోతే పూర్తి ఇంటర్వ్యూగా దీనిని వీక్షించాక మాత్రమే వారి సంభాషణల అంతర్యం ఏమిటి? అనేది అర్థమవుతుంది.
View this post on Instagram